ఏపీలో భారీ ఎత్తున గ్రామసచివాలయం, వార్డు సచివాలయం ఉద్యోగాలను భర్తి చేస్తున్నారు. సీఎంగా జగన్ వచ్చీ రాగానే దాదాపు లక్షన్నర ప్రభుత్వ ఉద్యోగాలను నోటిఫికేషన్ వేశారు. యుద్ధప్రాతిపదికన వీటి నియామక ప్రక్రియ చేపట్టారు. కేవలం 10 రోజుల్లో దాదాపు 20 లక్షల మందికి పైగా అభ్యర్థులు రాసిన ప్రశ్నాపత్రాలను స్క్రూటినీ చేసి ఫలితాలు వెల్లడించారు.


గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఒకే నోటిఫికేషన్ ద్వారా ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేదు. ఏ ప్రభుత్వం కూడా ఇంత తక్కువ సమయంలో నియామకాలు జరపలేదు. ఇది జగన్ కు రాజకీయంగా చాలా లాభించే అంశం. అయితే ఫలితాలు వెలువడిన మరుసటి రోజే.. ఈ ఫలితాల్లో గోల్ మాల్ జరిగిందని ఆంధ్రజ్యోతి పత్రిక బ్యానర్ కథనం వెలువరించడం కలకలం రేపుతోంది.


అయితే ఈ కథనంపై అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏపీపీఎస్సీలో పని చేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ప్రశ్నాపత్రాన్ని టైప్ చేశారని ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది. కానీ పరీక్ష పత్రాన్నినిపుణులతో తయారు చేయిస్తారు. దాన్నే ప్రిటింగ్ కు పంపుతారు. అంతటి కీలకమైన ప్రశ్నాపత్రాన్ని ఔట్ సోర్సింగ్ ఉద్యోగితో టైపు చేయించరు. అలా చేసి ఉంటే..గతంలో జరిగిన ఎన్నో పరీక్షలు లీకయ్యేవి.


ప్రశ్నాపత్రం నిపుణుల నుంచి నేరుగా ఏపీపీఎస్సీకి కాకుండా.. ఓ రిటైర్డ్ అధికారి చేతికి పంపారు అని ఆంధ్రజ్యోతి తన కథనంలో పేర్కొంది. కానీ అసలు పరీక్షల ప్రక్రియలో రిటైర్డ్ అధికారి ప్రమేయం ఎందుకు ఉంటుంది. ఉంటే ఓ రిటైర్డ్‌ అధికారి అని.. పేర్కొన్నారు కానీ ఆయన పేరు ప్రస్తావించలేదు. ఇది అభ్యర్థులను గందరగోళ పరిచేందుకేనా.. లేక ఈ పేపర్ చాలా మందికి వెళ్లిందని దుష్ప్రచారం చేసేందుకా అన్నది అర్థం కాని విషయం.


మరో కీలకమైన విషయం ఏమిటంటే.. పేపర్ లీక్ అయిన విషయం కేవలం ఫలితాలు వచ్చాకే ఆంధ్రజ్యోతి కనిపెట్టిందని రాసుకొచ్చారు. అలాంటప్పుడు ఫలితాల విశ్లేషణను బట్టే పేపర్ లీకైందని.. అందుకు ఏపీపీఎస్సీ ఉద్యోగుల బంధువులకు ఉద్యోగాలు రావడమే ఉదాహరణ అని వాదించడం లో కొంత వరకూ అర్థంచేసుకోవచ్చు. అనుమానించొచ్చు. కానీ రిటైర్డ్ అధికారి వ్యవహారం గురించి రాయడం.. అది కూడా పేరూ ఊరూ లేకుండా రాయడం ఈ ప్రభుత్వాన్ని బద్ నామ్ చేసేందుకేనా .. అన్న అనుమానం కలుగుతోంది. అధికారంలో వచ్చిన మూడు నెలలకే జగన్ లక్షన్నర ఉద్యోగాలు ఇచ్చిన క్రెడిట్ దక్కకుండా చేసేందుకు తెలుగు దేశం పక్షపాతిగా ముద్రపడిన ఆంధ్రజ్యోతి ప్రయత్నిస్తోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: