నియోజక వర్గంలో అధికారపార్టీ వాళ్ళను విస్మరించి ప్రతిపక్ష పార్టీ వాళ్లకు ఎమ్మెల్యే కొమ్ముకాస్తుంది వై ఎస్ ఆర్ సీపీ  కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఓ ఎమ్మెల్యే వైఖరిని బాహాటముగా ఎత్తిచూపడం గమనార్హం. ఈ సంఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. అందులోనూ సంచలనాలకు మరు పేరుగా.. వైసీపీ ఫైర్ బ్రాండ్ గా  ఉన్న ఎమ్మెల్యే రోజాకు ఎదురైనా సంఘటన ఇది. తెలుగు దేశం పార్టీ వారికి పనులు అవుతున్నాయి. కానీ  తమకు అవడం లేదని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు  రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రామ సచివాలయ కార్యక్రమానికి తమను పిలవకపోవడాన్ని తప్పుపట్టారు. అంతే కాకుండా  ఎమ్మెల్యే రోజా కారుపై దాడికి యత్నం  చేశారు. ఈ ఘటనతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 

రోజా సర్దిచెప్పే ప్రయత్నం..

ఎమ్మెల్యే రోజా కారు అద్దం దించి వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ, వైసీపీ కార్యకర్తలు ఆమె మాట వినకుండా మరింత పెద్దగా ఎమ్మెల్యే రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా సెల్వమణికి నిరసన సెగ తగిలింది. నగరి నియోజకవర్గంలోని పుత్తూరు మండలం కేబీఆర్ పురంలో గ్రామ సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజాను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కనీసం తమను పట్టించుకోలేదని, కనీసం పార్టీ కార్యకర్తలను కూడా పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. 
మాజీ ఎంపీటీసీ కుమారుడు, మరికొందరు వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే రోజా కారును అడ్డగించారు. సుమారు 20 నిమిషాల పాటు ఆమె కారును ముందుకు కదలనివ్వలేదు. టిడిపి వారికి పనులు అవుతున్నాయి గాని తమకు అవడం లేదని  రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ దాడి కేసులో హరీష్ సంపత్, సురేష్ రిషేంద్ర, అంబు, సరళ, రామ్మూర్తిపై... 143, 341, 427, 506, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ దాడి వెనుక రాజకీయనేతల హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లోకల్‌గా ఉన్న అమ్ములు వర్గమే ఈ దాడికి దిగిందని రోజా అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా వీరి వెనుక జిల్లాకు చెందిన ముఖ్యమైన నేతలు కూడా ఉన్నారని ఆమె అంటున్నారు. గతంలో కూడా రోజాను ఓడించనాకి తన వెనుక ప్రయత్నాలు చేశారని రోజా పార్టీ హైకమాండ్‌తో పాటు.. సీఎం కార్యలయానికి తెలిపారు. ఈ ఘటనను సీఎం జగన్ దృష్టికి కూడా రోజా తీసుకెళ్లనున్నారు. గ్రామ సచివాలయ కార్యక్రమానికి తమను పిలవకపోవడాన్ని తప్పుపట్టారు. అయితే, పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: