నేటి కాలంలో పెళ్లంటే అంతా హడావుడి, ఆర్భాటమే మనకు ఎక్కువగా కనిపిస్తుంది. పెళ్లి కోసం మనం పేట్టే ఖర్చు ఫంక్షన్స్ హాల్స్, రిసెప్షన్ అబ్బో ఇలా చాలా హడావిడే చేస్తాం. ఇందుకు విరుద్ధంగా ఒక కుటుంబం పూర్తి ప్రకృతి వనరులతో వివాహం జరిపించాలి అని అనుకున్న్నారు. అనుకున్నదే తడవుగా హంగు ఆర్భాటం షామియానాలు, గాత్ర లేకుండా పూర్తి ప్రకృతి వనరులతో వివాహం జరిపించేశారు. 

 

విశాఖ జిల్లాలో ఓ జంట పూర్తిగా సంప్రదాయ పద్ధతుల్లో, పర్యావరణహితంగా ఒక్కటవ్వడానికి సిద్ధం చేసుకొని  వివాహం జరిపించేసుకున్నారు . ఈ  పెళ్లి వేడుక పూర్తిగా ప్రకృతిలో లభించే వస్తువులతోనే, హిందూ సంప్రదాయంలో అచ్చమైన తెలుగు వివాహం అంటే ఏమిటో అందరికీ తెలిసేలా ఘనంగా వివాహం చేసుకున్నారు.

 

వివరాల్లోకి వెళితే.... విశాఖ జిల్లా లోని  పాయకరావుపేట మండలం ఎస్ రాయవరం గ్రామానికి చెందిన యువతికి, విశాఖ జిల్లా పెందుర్తి ప్రాంతానికి వరుడుకి వివాహం చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. వీరు ఇరువురి కుటుంబాలకు వున్నా దైవ  భక్తి కారణంగా, వారు ఇరు కుటుంబాలు పురాతన హిందూ సంప్రదాయ పద్ధతుల్లోనే పెళ్లి చేయాలని నిర్ణయానికి వచ్చారు. ప్రకృతిలో దొరికే వస్తువులతో,పర్యావరణానికి మేలు చేసే వాటితో వీరి వివాహం ఘనం గా నిర్వహించారు.
 

సహజంగా మనం వివాహానికి వాడే  టెంట్లు, షామియానాలు, సెట్టింగ్‌లు కాకుండా వెదురు కర్రలు, అరటి చెట్లు, తాటాకులు, కొబ్బరి ఆకులు, అరటి గెలలను ఉపయోగించి  సుమారుగా 80 అడుగుల పెండ్లి పందిరిని తో కూడిన కల్యాణ మండపాన్ని సిద్ధం చేశారు.ఆ పందిరిని పచ్చి పూలు, మొక్కజొన్న కండెలు, బెల్లం దిమ్మలతో, మామిడి కాయలు, రకరకాల పండ్లు, తామరపువ్వులు, కొబ్బరి మువ్వులు, మామిడాకులు, వరి కంకులతో సహజ సిద్ధం గా, ఎంతో సుందరం గా ఆ మండపాన్ని తీర్చి దిద్దారు. ఇది చూసిన జనం ఆహా ఏమి పందిరి ఏమి పందిరి అంటూ, వారి ఇరువురి కుటుంబ సభ్యులను పొగడ్తలతో ముంచేతేస్తున్నారు. ఏమైనా ప్రకృతిలో వొడిలో పెళ్లి చేసుకోవడం ఒక గొప్ప విషయమే గా నేటి కాలంలో...

 

మరింత సమాచారం తెలుసుకోండి: