ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆన్లైన్ మయం అయిపోయిన విషయం తెలిసిందే. అసలు ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని మనిషి లేడు.. ఇక స్మార్ట్ఫోన్ చేతిలో ఉంది అంటే ప్రపంచం మొత్తం మన కళ్ళముందు ఉన్నట్లే. ఒకప్పుడైతే ఎక్కడో విదేశాల్లో ఉన్న వారితో మాట్లాడటం కష్టమయ్యేది. ఇక ఏకంగా విదేశాల్లో ఉన్న వారిని కూడా ఉన్నచోటి నుండి చూస్తున్నామూ. అంతలా రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోతుంది. అయితే ప్రస్తుతం ఎక్కువమంది స్మార్ట్ ఫోన్ లో  మాట్లాడటానికి.. ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. పక్కన ఎంత మంది స్నేహితులు ఉన్న ఎక్కడో  ఉన్న స్నేహితులతో మాట్లాడడానికి ఆరాటపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువగా స్నేహితులతో చాటింగ్ చేయడానికి ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్. 

 

 ప్రస్తుతం వాట్సాప్ కి విపరీతమైన వినియోగదారులు ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇక రోజురోజుకు సరి కొత్త ఫీచర్లను తీసుకొస్తూ.. వాట్సాప్ వినియోగదారులను మరింతగా ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు వాట్సాప్ నుంచి మెసేజ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వాట్సాప్ లో మాట్లాడడం.. వీడియో కాల్ ద్వారా కలుసుకోవడం చేస్తున్నారు. డైరెక్ట్ గా కలిసి మాట్లాడే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు అంతా ఎక్కడ చూసినా వాట్సాప్ మయమే. అయితే అటు వాట్సాప్ కూడా వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఎప్పుడూ సరికొత్త ఫీచర్లతో తెర మీదకి  వస్తూనే ఉంది. 

 


 ఇక ఇప్పుడు తాజాగా మరో సరికొత్త ఫీచర్ తో  తెరమీదికి వచ్చింది వాట్సాప్. కొద్దిరోజుల క్రితమే వాట్సాప్ లో డార్క్ మోడ్  తీసుకురాగా  తాజాగా మరో అద్భుతమైన ఫీచర్ ను తీసుకొచ్చింది. ఫోటోలు,  వీడియోలు, ఆడియోలు డాక్యుమెంట్ల కోసం అడ్వాన్స్ సెర్చ్ మెథడ్ ను  ప్రవేశపెట్టనుంది  వాట్సాప్. దీనివల్ల మన మొబైల్లో వేలకొలది ఫోటోలు వీడియోలు ఉన్నప్పటికీ ఫిల్టరింగ్ మోడ్ ఆన్ చేసి మనకు కావాల్సిన డేటాని సెర్చ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్  లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకొన్ని రోజుల్లో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: