పెళ్లిచూపుల్లో సెక్స్ అనుభవం ఉందా లేదా అని అడగరా..? ఇవేం మాటలు.. ఎవరు అన్నారు.. ఎక్కడ అన్నారు..? అనేగా మీ ప్రశ్నలు. అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లదాం. ఉద్యోగం ఇచ్చేటపుడు ఏమి అనుభవం ఉందని అడిగేవారు, పెళ్లిచూపుల్లో అబ్బాయికి ఏమి అనుభవం ఉందని ఎందుకు అడగరు? అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సీఎం ఇబ్రహీం చేసిన వ్యాఖ్యలు గురువారం విధాన పరిషత్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మరియు శాసనమండలిలోనే ఇలా అసభ్యంగా మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది.
కర్నాటకలో ప్రస్తుతం విధాన పరిషత్ సమావేశాలు కొనసాగుతున్నాయి. గురువారం జరిగిన సభలో ఓ అంశంపై ఎమ్మెల్సీ ఇబ్రహీం మాట్లాడుతూ.. ఉద్యోగం కోసం వెళ్తే ఏమి అనుభవం ఉందని ఇంటర్వ్యూలో అడుగుతారని.. అదే మాదిరి పెళ్లిచూపుల సమయంలో అబ్బాయికి సెక్స్ అనుభవం ఉందా లేదా అని అడగరా అని ఆయన ప్రశ్నించారు. దీంతో మహిళలకు అవమానకరమని బీజేపీ జేడీఎస్ తో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఇబ్రహీం ఆడ పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు పిల్లాడికి అనుభవాన్ని అడిగారా? అని ప్రశ్నించారు.
ఈ దశలో అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య వాగ్వివాదం నెలకొంది. ఇబ్రహీం క్షమాపణ చెప్పాలని విధాన పరిషత్ బీజేపీ సభ్యులు పట్టుబట్టారు. ఈ విషయంపై విపక్షనేత ఎస్.ఆర్.పాటిల్, జేడీఎస్ సభ్యుడు బసవరాజ హొరట్టి తదితర సభ్యులు సమాలోచన జరిపారు. చివరకు బసవరాజ హొరట్టి ఇబ్రహీం ఆ మాటను మాట్లాడకుండా ఉండాల్సిందని తెలిపారు. ఈ క్రమంలోనే ఆయన తన మాటలను వెనక్కి తీసుకోవాలని సూచించారు. దీంతో ఇబ్రహీం తన మాటలను ఉపసంహరించుకున్నట్లు తెలపడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. అయితే ఈయన మాటలు వెనక్కి తీసుకున్నప్పటికీ.. ప్రస్తుతం ఇబ్రహీం మాటలు వైరల్గా మారాయి. ఇక నెటిజన్లు సైతం తమదైన శైలిలో ఇబ్రహీం వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు.