దేశంలో రోజు రోజుకీ కరోనా వైరస్ ప్రభావం పెరిగిపోతుంది.  ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.  ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు.   కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ప్రజలందరూ సోషల్ డిస్టెన్స్‌ పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఏపీ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 21కి చేరడంతో  సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించి... ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.

 

అర్భన్ ప్రాంతాల్లో కరోనా ప్రభావం ఎక్కువ ఉందని.. విదేశాల నుంచి వచ్చిన వారు ఇక్కడ ఎక్కువ ఉండటమే ఇందుకు కారణం అన్నారు సీఎం జగన్. పట్టణాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు.  తూ.గో జిల్లాలో కొత్తగా రెండు పాజిటీవ్ కేసులు నమోదు కావడంతో మరింత అప్రమత్తం అవాల్సి వస్తుందని అన్నారు.  విశాఖ, నెల్లూరు, తిరుపతి, కృష్ణ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం అన్నారు. ఇకపై కరోనా చికిత్సకు ప్రైవేటు ఆసుపత్రులను కూడా వినియోగిస్తామని చెప్పారు. విశాఖ, విజయవాడ, కాకినాడ, తిరుపతిలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రులను కూడా కరోనా చికిత్స కోసం ఉపయోగిస్తున్నామని తెలిపారు. ముందు జాగ్రత్తగా ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్ల సంఖ్యను పెంచుతున్నామని, క్వారంటైన్ కేంద్రాల్లో పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్టు వివరించారు. ఇళ్లలో సదుపాయాలు లేకపోతే క్వారంటైన్ కేంద్రాలకు రావొచ్చని కన్నబాబు సూచించారు.

కరోనా లాక్ డౌన్ కారణంగా వ్యవసాయ రంగంలో ఇబ్బందులు రాకుండా చూడాలని సీఎం సూచించారని వెల్లడించారు. ప్రాసెసింగ్ యూనిట్లలో వ్యక్తుల మధ్య భౌతిక దూరం పాటించేలా చూడాల్సి ఉందని స్పష్టం చేశారు.ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో లాక్ డౌన్ మరింత పటిష్టంగా అమలు చేయాల్సి ఉందని, వైద్య పరమైన అంశాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple


 

 

మరింత సమాచారం తెలుసుకోండి: