మొదట్లో అంతగా కరోనా కేసులు లేని ఆంధ్రప్రదేశ్‌ లో కూడా ఇప్పుడు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. జిల్లాకు ఓ పది కేసులు కనీసం కనిపంచే అవకాశాలున్నాయి. దీనికితోడు ఇంకా ఈ కేసులు పెరిగే ఛాన్సు ఉంది. అయితే ఈ సమయంలో ఏపీ సీఎం జగన్ కరోనా సమస్యను సరిగ్గా డీల్ చేయడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కరోనా ఇంత సీరియస్ గా ఉన్నా జగన్ మాత్రం నామ్‌ కే వాస్తే సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలుగు దేశం నేతలు విమర్శిస్తున్నారు.

 

 

అంతే కాదు...కరోనా కాలంలోనూ వైసీపీ నేతలు ఆ సాకుతో దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కరోనా ప్రభంజనం రాష్ట్రంలో పెరుగుతూ ఉంటే.. సరైన ఏర్పాట్లు చేయకుండా జగన్ నిర్లక్ష్యం వహిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా విమర్శిస్తున్నారు. ఆయన హైదరాబాద్ నుంచే ప్రెస్ మీట్లు పెడుతూ ప్రభుత్వ వైఫల్యాలను బయటపెడుతున్నారు.

 

 

ఇక జగన్ సర్కారుపై తరచూ విరుచుకుడపడే దేవినేని ఉమ, వర్ల రామయ్య, జవహర్, యనమల రామకృష్ణుడు వంటి వారు తరచూ మీడియా ముందుకు వచ్చి విమర్శలు కొనసాగిస్తున్నారు. అయితే వైసీపీ నాయకులు ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నారు. సంక్షోభ సమయంలో అత్యవసరాల పేరుతో దోచుకునే అవకాశం కోల్పోయామనేది తెలుగు దేశం ఏడుపని ఆరోపిస్తున్నారు. సంక్షోభాల‌ను అవ‌కాశాలుగా మార్చుకునే మాఫియా అల్లాడిపోతోంద‌ని వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి విమ‌ర్శించారు.

 

 

సీఎం జగన్ గారు సీరియ‌స్‌గా లేరట. అత్యవసరాల పేరుతో దోచుకునే అవకాశం కోల్పోయామనేది వీరి ఏడుపు. కరోనా సోకితే ప్రాణం పోయినట్టేనని చెప్పాలట. ఆందోళన చెందొద్దు అని ధైర్యమిస్తే అప్రమత్తంగా లేనట్టట!’ అని ఆయన సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: