క‌రోనా వైర‌స్‌పై పోరులో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్రమోడీ క‌న్నా.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముందంజ‌లో ఉన్నారు. మ‌ర్చి 22వ తేదీన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీ దేశ‌వ్యాప్తంగా జ‌న‌తా క‌ర్ఫ్యూను విధించిన విష‌యం తెలిసిందే. ఉద‌యం 7గంట‌ల నుంచి రాత్రి 9గంట‌ల‌కు వ‌ర‌కు జ‌న‌తా క‌ర్ఫ్యూను పాటించాల‌ని కోరారు. అయితే.. తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం జ‌న‌తా క‌ర్ఫ్యూను ఏకంగా 24 గంట‌ల‌పాటు అమ‌లు చేయాల‌ని పిలుపునిచ్చారు. ఆ త‌ర్వాత లాక్‌డౌన్ విష‌యంలోనూ సీఎం కేసీఆర్ ముందంజ‌లోనే ఉన్నారు. ఇక ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీ ఏప్రిల్ 14వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్‌ను విధించిన‌ విష‌యం తెలిసిందే. ఈ గ‌డువు ద‌గ్గ‌ర‌ప‌డ‌డంతో కేంద్రం నిర్ణ‌యంతో సంబంధం లేకుండానే.. రెండు రోజుల ముందే సీఎం కేసీఆర్ విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసి ఏప్రిల్ 30వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్‌ను పొడిగించారు. 

 

ఇక ఏప్రిల్ 14న జాతిని ఉద్దేశించి ప్ర‌ధాని మోడీ మాట్లాడుతూ.. మే 3వ‌ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.  ఏప్రిల్ 20వ తేదీ త‌ర్వాత లాక్‌డౌన్ అమ‌లు స‌డ‌లింపులు ఉంటాయ‌ని ప్ర‌ధాని ప్ర‌క‌టించి, మార్గ‌ద‌ర్శ‌కాలు కూడా విడుదల చేశారు. ఇక ఆదివారం నాడు సీఎం కేసీఆర్ మంత్రివ‌ర్గ స‌మావేశం ఏర్పాటు చేసి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఏకంగా మే 7వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్‌ను కొన‌సాగించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఇలా క‌రోనాపై పోరులో ప్ర‌తీ ద‌శ‌లోనూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌నదైన ప్ర‌త్యేక‌త‌ను చూపిస్తున్నారు. అయితే..ఇక్క‌డ కేసీఆర్ మ‌రో ట్విస్ట్ ఇచ్చారు. మే 5వ తేదీన మంత్రివ‌ర్గ స‌మావేశం ఉంటుంద‌ని తెలిపారు. ఇక అప్ప‌టివ‌ర‌కు కూడా తెలంగాణ‌లో క‌రోనా ప్ర‌భావం ఉంటే.. నిర్ణ‌యం ఎలా ఉంటుందోన‌ని అంద‌రిలో ఇప్ప‌టి నుంచే ఉత్కంఠ మొద‌లైంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: