పాకిస్తాన్ భారత్ కి ఎన్నో ఏళ్ల నుంచి శత్రుత్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఎప్పుడు భారత్ పై దాడులు జరపాలా  అని వేచి చూస్తూ ఉంటుంది. అయితే భారత్ నుంచి చాలామంది వివిధ దేశాలకు వెళ్లి ఉన్నతమైన పదోన్నతులు పొందుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. మరి పాకిస్తాన్ లో హిందూ మతానికి చెందిన వారు  ఎవరైనా ఉద్యోగాలు చేయడం కానీ లేదా ఏదైనా పదోన్నతులు పొందడం గాని చేస్తారా. ఎవరిని అడిగినా దీనికి సమాధానం అసాధ్యం అని వస్తుంది. కానీ ప్రస్తుతం ఆ అసాధ్యాన్ని సుసాధ్యం గా మారిపోయింది.. పాకిస్తాన్ చరిత్రలోనే తొలిసారిగా ఓ హిందూ వ్యక్తి ఆ దేశ ఎయిర్ఫోర్స్ లో  ఉద్యోగ నియామకం పొందాడు. సింద్  ట్రావెల్స్ కు చెందిన రాహుల్ దేవ్ అనే యువకుడు మొట్టమొదటిసారిగా ఈ ఘనత సాధించి పాకిస్తాన్ వైమానిక దళంలో చోటు సంపాదించుకున్నాడు.

 

 

 పాకిస్తాన్ వైమానిక దళంలో జనరల్ డ్యూటీ పైలెట్గా హిందూ మతానికి చెందిన రాహుల్ దేవ్ నియమితులు అయినట్లు ఆ దేశ పత్రికల్లో పలు శీర్షికలో ప్రచురించారు. అటు అంతర్జాతీయ మీడియా కూడా ఈ విషయాన్ని పలు శీర్షికల ద్వారా ప్రచురించింది. పాకిస్తాన్ లో హిందువులు అత్యధికంగా నివసించే ప్రావిన్స్ లోని  అతి పెద్ద జిల్లా తార్పార్కర్ లోని ఓ కుగ్రామంలో పుట్టిన యువకుడు రాహుల్ దేవ్ . పేదరికాన్ని జయించి ఉన్నత విద్యను అభ్యసించి ప్రస్తుతం వైమానిక దళం వరకు చేరుకున్నాడు అనే పత్రిక కథనాలు అతని గురించిన వివరాలను వెల్లడించాయి. ఇక పాకిస్తాన్ వైమానిక దళంలో జనరల్ డ్యూటీ పైలెట్గా హిందూ మతానికి చెందిన రాహుల్ దేవ్ నియామకం జరగడంపై అక్కడి హిందువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆల్ పాకిస్తాన్ హిందూ పంచాయత్ సెక్రటరీ రవి దవాని  హర్షం వ్యక్తం చేశారు. 

 

 

 దేశంలో మైనారిటీ వర్గానికి చెందిన అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు సైనికదళం తో పాటు వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతే కాకుండా పాకిస్తాన్లో హిందూ మతానికి చెందిన చాలామంది వైద్యులు గా పనిచేస్తూ ఇక్కడ ప్రజలందరికీ సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు. ఒకవేళ పాకిస్తాన్ ప్రభుత్వం కనుక మైనార్టీ లపై దృష్టి పెడితే... భవిష్యత్తులో అనేక మంది ప్రస్తుతం రాహుల్ దేవ్  లాగే దేశ సేవ చేయడానికి సిద్ధం అవుతారు అని పేర్కొన్నారు ఆల్ పాకిస్తాన్ హిందూ పంచాయత్ సెక్రటరీ రవి ధవాని.

మరింత సమాచారం తెలుసుకోండి: