ఇక అధికారంలోకి వచ్చాక జగన్ కేంద్ర బీజేపీ తో మంచి సంభంధాలు కొనసాగిస్తున్నారు.. ఇప్పటివరకు ఒక్క భేదాపిప్రాయాలు రాలేదు.. ఇటీవలే పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు ను సైతం వైసీపీ పార్టీ సపోర్ట్ చేసి మోడీ ఆదరాభిమానాలను చూరగొంది.. ఇక ఇక్కడే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు గతంలో కాకుండా మోడీ పై ఎనలేని ప్రేమను కురిపిస్తున్నాడు.. ద్రోహి అన్న అదే నోరుతో ఇప్పుడు దేవుడు అనే స్థాయికి చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం టీడీపీ కి సైతం ఆశ్చర్యకరంగా ఉంది..
సాధారణంగా ఏ పార్టీలో ఉన్నవారు ఆ పార్టీ అధినాయకులపై ఈగ వాలినా ఊరుకోరు. రాజకీయ పరంగా వచ్చే ఎటువంటి విమర్శలనైనా వెనువెంటనే తిప్పకొట్టేస్తుంటారు. అయితే ఏపీలో మాత్రం విచిత్రమైన పరిస్థితి కన్పిస్తోందంటున్నారు విశ్లేషకులు. ప్రధాని నరేంద్రమోదీపై కనీసం ఈగ కూడా వాలనీయకుండా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చూసుకోవడాన్ని వారు ఉదహరిస్తున్నారు. ఈ జాగ్రత్త ఎదో అప్పుడే ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా అని కొంతమంది అభిప్రయడుతున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి