జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి అమరావతి రైతులు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. 300 రోజుల పైనుంచి రైతులు అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. అటు ప్రతిపక్ష టీడీపీ కూడా అమరావతి కోసం పోరాడుతుంది. ఇక బీజేపీ తప్పా మిగిలిన ప్రతిపక్షాలు అమరావతికు మద్ధతు ఇస్తున్నాయి. అయితే తాజాగా అమరావతికి శంఖుస్థాపన జరిగి ఐదేళ్లు పూర్తి అయింది. దీంతో రైతులు మరింతగా ఉద్యమం ఉధృతం చేశారు.

ఇక అమరావతికి ఐదేళ్లు పూర్తి అయిన సందర్భంగా పలువురు నాయకులు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సైతం స్పందిస్తూ…చంద్రబాబుపై విమర్శలు చేస్తూనే, 50 వేల ఖరీదు చీర కట్టుకుని ఉద్యమాలు చేసే నాయకురాలు కూడా మమ్మలి విమర్శిస్తున్నారని మండిపడ్డారు. అయితే ఆ నాయకురాలు పేరు మాత్రం చెప్పలేదు. కానీ ఆమె ఎవరో కాదు కమ్మ సామాజికవర్గానికి కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ అని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

పద్మశ్రీ అమరావతిలో బాగా యాక్టివ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. అమరావతి కోసం పోరాడుతూనే, జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే బీజేపీపై కూడా ఆమె ఫైర్ అవుతున్నారు. కానీ ఐదేళ్లు అధికారంలో ఉండి అమరావతిని కట్టని చంద్రబాబుని మాత్రం ఒక్క మాట అనడం లేదు.

పద్మశ్రీ ఎప్పుడు జగన్‌ని, బీజేపీని టార్గెట్ చేసే విమర్శలు గుప్పిస్తున్నారు. పైగా ఆమె కాస్త రిచ్‌గా కనబడతారు. అందుకే బీజేపీ నేత విష్ణు, పద్మశ్రీనే టార్గెట్ చేసి కామెంట్ చేశారని తెలుస్తోంది. పైగా ఆమె టీడీపీకి అనుకూలంగా ఉన్నారనే వాదన ఎక్కువ వినిపిస్తోంది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్స్ సమయంలో ఆమె టీడీపీలోకి వెళ్ళి జెడ్పీ అభ్యర్ధిగా బరిలో ఉంటారని ప్రచారం జరిగింది. కానీ ఆమె పార్టీ మారలేదు గానీ, టీడీపీకి మాత్రం అనుకూలంగానే నడుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: