దేశీయ దిగ్గజ ప్రభుత్వరంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం తమ కస్టమర్లకు ఎన్నో రకాల పాలసీలను అందుబాటులో ఉంచింది అన్న విషయం తెలిసిందే. వివిధ పాలసీలతో తమ కస్టమర్లకు ఎంతో మెరుగైన సర్వీసులు అందిస్తూ ప్రస్తుతం దిగ్గజ బీమా సంస్థ గా దూసుకుపోతుంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఇక తమ పాలసీలతో రోజురోజుకు కస్టమర్లను ఆకర్షిస్తూ కస్టమర్ల సంఖ్య అంతకంతకూ పెంచుకుంటుంది. తమ కస్టమర్లకు అన్ని రకాల ఆర్థిక భద్రత కల్పించే విధంగా ప్రస్తుతం ఎన్నో రకాల పాలసీలను అందిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తల్లిదండ్రులకు తమ పిల్లల భవిష్యత్తును ఎంతో మెరుగ్గా తీర్చిదిద్దేందుకు చిల్డ్రన్స్ ప్లాన్స్  కూడా అందుబాటులో ఉంచింది అన్న విషయం తెలిసిందే.


 తమ కస్టమర్ల పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించే విధంగా ఎల్ఐసి జీవన్ తరుణ్ పేరుతో ఒక సరికొత్త పాలసీ అందిస్తుంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. పిల్లలకు ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పాలసీ యొక్క మెచ్యూరిటీ కాలం 25 ఏళ్లు ఉంటుంది. అయితే 20 ఏళ్ల నుంచి ప్రతి ఏడాది కొంత మొత్తాన్ని ఈ పాలసీ కింద పొందేందుకు అవకాశం ఉంటుంది. 0 నుండి 12 ఏళ్ల వయసు లోపు ఉన్న పిల్లల పేరు పై ఈ పాలసీ తీసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. అంతేకాదు ఈ పాలసీ తీసుకోవాలనుకునే కస్టమర్లకు నాలుగు రకాల ఆప్షన్లను కూడా అందుబాటులో ఉంచింది.



 మొదటిది 100% మెచ్యూరిటీ బెనిఫిట్స్ పొందవచ్చు.. పాలసీ గడువు ముగియగానే పాలసీ మొత్తం బోనస్ వంటివి కూడా లభిస్తాయి. ఇక రెండవది 20 ఏళ్ల తర్వాత ప్రతి ఏడాది పాలసీ మొత్తంలో 5 శాతం పొందేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ ఆప్షన్ ఎంచుకుంటే మెచ్యూరిటీ కాలం తర్వాత 75% పాలసీ డబ్బులు వస్తాయి. ఇక మూడవది 20 ఏళ్ల తర్వాత ప్రతి సంవత్సరం 10 శాతం పొందుతూ మెచ్యూరిటీ సమయంలో 50 శాతం మాత్రమే పాలసీ డబ్బులు లభిస్తాయి. అదే సమయంలో నాలుగవదీ ప్రతి ఏడాది 15 శాతం తీసుకుంటే మెచ్యూరిటీ సమయంలో 25% పాలసీ డబ్బులు మాత్రమే వస్తాయి మీరు ఎంచుకునే పాలసీ ప్రీమియం కూడా మారుతూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: