పోలవరం ప్రాజెక్టు పై
ఏపీ అసెంబ్లీలో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఈ గందరగోళం తారాస్థాయికి చేరి ఏకంగా 9మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్ కి దారి తీసింది. చంద్రబాబు హయాంలో పోలవరంలో అవినీతి భారీగా జరిగిందంటూ వైకాపా సభ్యులు ఆరోపించగా నిరూపించమంటూ
టీడీపీ ఆందోళనకు దిగింది. దాంతో,
టీడీపీ సభ్యులు సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్నారంటూ
టీడీపీ సభ్యుల పై స్పీకర్ ఈ వేటు వేశారు.ఈ చర్యతో వరుసగా మూడోరోజు కూడా
టీడీపీ సభ్యులు సస్పెన్షన్ కి గురయినట్లయింది. సస్పెండ్ అయినవారిలో అచ్చెమ్ నాయుడు, రామానాయుడు,
రవికుమార్,
బాల వీరాంజనేయస్వామి, జోగేశ్వరరావు, రామకృష్ణబాబు,
అశోక్,
satya PRASAD' target='_blank' title='అనగాని
సత్య ప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అనగాని
సత్య ప్రసాద్, ఏలూరి సాంబశివరావు ఉన్నారు.
ఈ సందర్భంగా నీటిపారుదల
మంత్రి అనిల్ కుమార్ యాదవ్, విపక్ష నేత చంద్రబాబు నడుమ మాటల యుద్ధం జరిగింది. అదే సందర్భంలో సీఎం
జగన్ మాట్లాడుతూ చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని,పోలవరం పూర్తి చేయాలన్న ఉద్దేశం ఆయనకు లేదని సీఎం
జగన్ విమర్శించారు. 2004లో అప్పటి
ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 86 శాతం భూసేకరణ చేసి పోలవరం కుడి కాలువ పనులని శరవేగంగా పరుగులెత్తించారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు హయాంలో కేవలం 14 శాతం పనులు మాత్రమే జరిగాయన్నారు.
తమ ప్రభుత్వం అమలుచేసిన రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా 1343 కోట్లు
ఆదా జరిగిందన్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం విషయంలో ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదని, ప్రాజెక్ట్ నిర్మాణం పట్ల శ్రద్ద లేదని విమర్శించారు. తమ హయాంలోనే పోలవరం పనులు జోరందుకున్నాయంటూ చెప్పుకొచ్చారు.
తెలంగాణ నుంచి ఏడు మండలాలను ఆంధ్రాలో కలపకుంటే పోలవరం భవిష్యత్తు అంధకారమయ్యేదన్నారు. పోలవరం విషయంలో కేంద్రాన్ని ఒక్క మాటకూడా అడగలేని పరిస్థితిలో ప్రభుత్వం పడిపోయిందన్నారు.
ఈ సందర్భంగా మంత్రి
అనిల్ మాట్లాడుతూ పోలవరం ఎత్తు ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదన్నారు. అనుకున్న మేరకు సకాలంలో పోలవరం నుంచి నీటిని విడుదల చేస్తామంటూ ప్రకటించారు. పోలవరం అంచనావ్యయంలో చంద్రబాబు చేసిన తప్పులని సరిద్దికుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. 2021
డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామంటూ తెలిపారు.
టీడీపీ హయాంలోనే పోలవరం పనులు వేగవంతమయ్యాయని, 2013 ముగిసే నాటికే టెండర్లు పూర్తయ్యాయన్నారు. పోలవరాన్ని వివాదంలోకి నెట్టడం సరికాదన్నారు. మీరు తవ్విన గోతిలో మీరే పడే పరిస్థితి వచ్చిందంటూ బాబు హెచ్చరించారు.