దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ వైరాస్ బారిన పడిన వాళ్ళు త్వరగా కోలుకోవాలని ప్లాస్మా థెరపీ చేపిస్తూ ఉంటారు. ఇక కరోనా సోకి తగ్గినవారి ప్లాస్మా ఇతర రోగులను కాపాడుతుందని, అది అపర సంజీవని అన్నంతగా ప్రచారం పొందింది. కరోనా గురించి పెద్దగా ఏమీ తెలియని సమయంలో ప్లాస్మా థెరపీని ఆశాకిరణంగా భావించారు. ఇక అందరు ప్లాస్మాను డొనేట్ చేయాలని ప్రభుత్వాలు వెల్లడించాయి.


అయితే ఇటీవల జరిపిన పరిశోధనలలో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. కరోనా చికిత్సలో ప్లాస్మా థెరపీ ప్రయోజనం శూన్యమని తేల్చాయి. అంతేకాదు ప్లాస్మా థెరపీ వల్ల కరోనా వైరస్‌ కొత్త మ్యూటెంట్లు తయారయ్యాయని వెల్లడించారు. ఇక వైరస్‌ సామర్థ్యాన్ని పెంచుకుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో మన దేశంలో కోవిడ్‌ చికిత్సల కోసం అనుసరిస్తున్న ప్రొటోకాల్‌ నుంచి ప్లాస్మా థెరపీని తొలగించాలని భారత వైద్య పరిశోధనా మండలి నిర్ణయించింది.



ఇక ప్లాస్మా థెరపీ కరోనా చికిత్సలో పనిచేయడం లేదంటూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 18 మంది వైద్యరంగ ప్రముఖులు, శాస్త్రవేత్తలు ఇటీవల ఐసీఎంఆర్‌కు లేఖ రాశారు. ఇక మన దేశంలో కొత్త రకం కరోనా వేరియంట్లు విజృంభించడానికి ప్లాస్మా థెరపీ కూడా కారణమని వారు పేర్కొన్నారు. ఐసీయూలో చేరిన పేషెంట్లకు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ప్లాస్మా థెరపీ ఇవ్వడం వల్ల.. అందులోని యాంటీబాడీస్‌ను ఎదుర్కొనేలా కరోనా వైరస్‌ కొత్త రూపాలు (మ్యూటెంట్లు) సంతరించుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు.



అయితే రక్త పరీక్షలు కూడా చేయకుండానే ఐసీయూలో ఉన్న రోగులకు నేరుగా ప్లాస్మా ఇవ్వడం ప్రాణాంతకంగా పరిణమిస్తోందని వెల్లడించారు. అలాగే ఈ థెరపీని అనధికారికంగా వినియోగించడం వల్ల కూడా పలు సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ప్లాస్మా చికిత్స అంశాన్ని అత్యవసరంగా సమీక్షించి, ఆపేయాలని కోరారు. ఇక ఇటీవలి అధ్యయనాల ఫలితాలు, తాజాగా నిపుణుల లేఖ నేపథ్యంలో ప్లాస్మా థెరపీని పక్కనపెట్టాలని ఐసీఎంఆర్‌ నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: