ఆంద్రప్రదేశ్ లో కరోనా కేసుల జోరు తగ్గుతోందనే చెప్పాలి. ఇది చాలా సంతోషం కలిగించే వార్త. గత వారం నుంచి రాష్ట్రంలో కేసులు తగ్గుతూ ఉండటం మంచి విషయంగా చెప్పుకోవాలి. ఇదంతా కూడా కర్ఫ్యు ప్రభావం అని పూర్తిగా అర్ధమవుతుంది.కర్ఫ్యు కారణంగా జనాలు పెద్దగా బయటకి రాకపోవడంతో వైరస్ వ్యాప్తి చెందట్లేదని చెప్పాలి.ఇక కరోనా కేసులు చూసినట్లయితే గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 10413 కేసులు నమోదయ్యాయి.కొత్తగా 83 మంది కోవిడ్‌కు బలయ్యారు.కరోనా కారణంగా కొత్తగా చిత్తూరు జిల్లాలో 14 మంది, పశ్చిమ గోదావరి 11, అనంతపురం 8, తూర్పు గోదావరి 7, శ్రీకాకుళం 7, గుంటూరు 6, కృష్ణా 6, విజయనగరం 6, కర్నూలు 5, విశాఖ 5, నెల్లూరు 4, ప్రకాశం 3, కడప జిల్లాలో ఒక్కరు చనిపోయారు.కొత్తగా 15469 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.


దీంతో కరోనా నుంచి రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 1591026కు చేరుకుంది.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 133773 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 85311 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 19619590 కరోనా పరీక్షలు నిర్వహించారు.జిల్లాలవారీగా చూస్తే అనంతపురం 865, చిత్తూరు 1574, తూర్పు గోదావరి 2075, గుంటూరు 686, కడప 610, కృష్ణా 692, కర్నూలు 425, నెల్లూరు 527, ప్రకాశం 631, శ్రీకాకుళం 427, విశాఖపట్నం 634, విజయనగరం 293, పశ్చిమ గోదావరి జిల్లాలో 974 కొత్త కేసులు నమోదయ్యాయి.ఇక ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతానికి చిత్తూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ కేసులు నమొదవ్వడం జరిగింది.ఆ జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో తగ్గడం ఊరట కలిగిస్తుంది.ఇక ఓవరాల్ గా చూసినట్లయితే రికవరీ రేటు కూడా 93-94 శాతం ఉందని తెలియడం ఊరట కలిగించే విషయం.జూన్ చివరి నాటికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కరోనా నుంచి కోలుకునే అవకాశాలు ఉన్నట్లు వైద్యాధికారులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: