సాధారణంగా ఎక్కడైనా నాగు పాము కనిపించింది అంటే చాలు అందరి వెన్నులో వణుకు పుడుతుంది. దూరం గా పాము కనిపించిన కూడా అంతకంటే దూరంగా పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. అదే సైలెంట్ గా వెళ్తున్న నాగు పాము పడగ విప్పి మన వైపు చూస్తుంది అంటే చాలు గుండెలు జారిపోతుంటాయి. ఇలా నాగుపాము అంటే చాలు తెగ భయపడిపోతుంటారు అందరు. ఇక కొన్ని కొన్ని సార్లు ఇళ్లల్లోకి నాగు పాములు వస్తే భయంభయంగానే దానిని తరిమికొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే భారతదేశంలో నాగుపామును దైవంగా భావిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.



 చాలామంది నాగు పాము పడగ విప్పితే తెగ భయపడిపోతుంటారు. కానీ కొంతమంది మాత్రం ఏకంగా దైవమే తన ఇంటికి వచ్చింది అని భావిస్తూ ఉంటారు. నాగుపాము కు పాలు పోయడం  వంటివి కూడా చేస్తూ ఉంటారు. అదేంటో కాని ఏకంగా నాగుపాము కూడా నిజంగానే దేవత అన్నట్లుగా ఎవరి పై దాడి చేయకుండా పాలు తాగి వెళ్లిపోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఇక ఇలాంటి తరహా వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. ఇక్కడ ఇంట్లోకి నాగుపాము చొరబడింది. అయితే ఆ మహిళ దానిని ఎంతో చాకచక్యంగా ఇంట్లో నుంచి బయటకు పంపించగలిగింది.


 ఆ నాగుపామును చూసి ఆ మహిళా కాస్తైనా భయపడలేదు ఆమె ముఖంలో ఎలాంటి ఆందోళన కనిపించలేదు. ఒక పొడవైన కర్ర చేతిలో పట్టుకుని నెమ్మదిగా దానిని బయటకు పంపడానికి ప్రయత్నించింది. అంతే కాదు నీకు పాలు పోస్తా బయటకు వెళ్ళు అంటూ ఆ పాము తో మాట్లాడటం కూడా ఈ వీడియోలో మనం చూస్తాం. అంతేకాదు ఇక గేట్ బయటికి వెళ్ళిన తర్వాత ఆ పాము పడగ విప్పి ఆ మహిళను చూస్తూ వెనక్కి పాకుతూ పోతుంది. అక్కడే నిలబడి ఆ పామును చూసిన మహిళ సరే సరే వెనక్కి వెళ్ళిపో అంటూ ఆ పాముతో మాట్లాడుతుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారగా.. ఆ మహిళ ధైర్యానికి అందరూ ఫిదా అవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: