అధికార వైసీపీలో వ‌ర్గ పోరు పెరిగింది. మ‌రీ ముఖ్యంగా ప‌రిష‌త్ ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఈ పోరు మ‌రింత విజృంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకుని ఆనందంలో ఉన్నా.. మ‌రోవైపు.. ఈ వ‌ర్గ పోరు పార్టీపై తీవ్ర ప్ర‌భావం చూపుతుండ‌డం.. పార్టీ అధిష్టానాన్ని తీవ్ర‌స్తాయిలో ఇర‌కాటంలోకి నెడుతోంది. దీనికి కార‌ణం.. పార్టీ అధినేత జ‌గ‌న్ వ్య‌వ‌హార‌మే అనే గుస‌గుస వినిపిస్తోంది. ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లోనూ.. స్థానిక ఎన్నిక‌ల్లోనూ.. ఆయ‌న ఒక పిలుపు ఇచ్చారు. పార్టీ నేత‌లు.. మంత్ర‌లు.. ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవాల‌న్నా.. అంతేకాదు.. పార్టీనిల‌వాల‌న్నా.. గెల‌వాల‌న్నా.. ఈ ఎన్నిక‌లే ముఖ్య‌మని చెప్పారు.

దీంతో అంద‌రూ క‌ష్ట‌ప‌డ్డారు. మంత్రులు కూడా స్థానిక ఎన్నిక‌ల్లోనూ.. ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లోనూ ఇంటింటికీ తిరిగి.. ప్ర‌చారం చేశారు. ప్ర‌తి ఒక్క‌రికీ ద‌ణ్నాలు పెట్టి మ‌రీ.. ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌ఫున ప‌నిచేశారు. దీంతో స్థానికంలోనూ.. మునిసిపాలిటీ, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. దీంతో మంత్రులు.. సీనియ‌ర్ నాయ‌కులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. వీరి ఆనందం.. కొద్ది సేప‌టికే ఆవిరైంది. ఎందుకంటే.. తామ ఇంత క‌ష్ట‌ప‌డి.. త‌మ వారికి ప‌ద‌వులు ఇప్పించుకోలేక పోయారు. కార్పొరేష‌న్ మేయర్‌, డిప్యూటీ మేయ‌ర్‌వంటి ప‌ద‌వులు. మునిసిపాలిటీల్లో చైర్మ‌న్‌, వైస్ చైర్మ‌న్ ప‌ద‌వులను చాలా మంది త‌మ వారికి ఇప్పించుకోలేక పోయారు.

ఇది కొన్ని రోజులు తీవ్ర సెగ‌లు పుట్టించింది. ఇంత‌లోనే జ‌డ్పీ ఎన్నిక‌లు వ‌చ్చాయి. దీంతో మ‌ళ్లీ సీన్ రిపీట్ అయింది. మీరు క‌ష్ట‌ప‌డండి.. ఈ సారి గుర్తింపు ఇస్తాం.. అంటూ .. పార్టీ నుంచి సందేశం వ‌చ్చింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో నాయ‌కులు క‌ష్ట‌ప‌డ్డారు. ప‌రిష‌త్‌లు మొత్తం గెలిచి .. జ‌గ‌న్‌కుకానుక గా ఇచ్చారు. అయితే.. ఇప్పుడు కూడా త‌మ వారికి న్యాయం జ‌రుగుతుందో లేదో .. అనే చింత నాయ‌కుల‌ను కుదిపేస్తోంది. జ‌డ్పీ చైర్మ‌న్‌, వైస్ చైర్మ‌న్ ప‌ద‌వుల‌ను త‌మ వారికి ఇప్పించుకునేందుకు మంత్రుల నుంచి ఎంపీల వ‌ర‌కు కూడా తీవ్ర ప్ర‌యాస ప‌డుతున్నారు.

కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అయితే.. ఈ ప‌రిష‌త్ పీఠాల కోసం.. వైసీపీ నాయ‌కులు వీధిన ప‌డుతున్నారు. చిత్తూరు, క‌డ‌ప‌, ప్ర‌కాశం, త‌దిత‌ర జిల్లాల్లో.. జ‌డ్పీ పీఠాల్లో త‌మ వారికి అవ‌కాశం ఇప్పించుకునేందుకు నాయ‌కులు నానా తంటాలు ప‌డుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మ‌రోవైపు వ‌ర్గాలుగా ఏర్ప‌డి.. మా వారికి ఇవ్వాలంటే.. మావారికి ఇవ్వాలంటూ.. నాయ‌కులు అధిష్టానం చుట్టూ తిరుగుతున్నారు. దీంతో అధిష్టానంఅంద‌రికీ .. సీల్డ్ క‌వ‌ర్‌లో స‌మాధానం చెబుతామంటూ.. మ‌రో సందేశం పంపింది. మ‌రో 24 గంట‌ల్లో జ‌డ్పీ చైర్మ‌న్ ప‌ద‌వుల‌కు ఎన్నిక జ‌రుగుతున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నేది చ‌ర్చ‌గా మారింది. వ‌ర్గ పోరులో ఎవ‌రికి అసంతృప్తి క‌లిగినా.. అది పార్టీపై ప్ర‌భావం చూపిస్తుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: