పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై దండయాత్ర చేయాలని భావిస్తే.. దాన్ని నిలువరించేందుకు వైసీపీ పక్కా ప్లాన్ గా వెళుతోంది. దీంతో ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. వైసీపీ పాలనకు చరమగీతం పాడాలని ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేకాదు వైసీపీ భయం చూపిస్తానన్నారు. ఏపీ పాలిటిక్స్ లో కలుపుమొక్కలు తీసివేయాలంటూ ఒక రేంజ్ లో పైర్ అయ్యారు.
అంతేకాదు ఏ ఒక్కరినీ మరిచిపోయే ప్రసక్తే లేదనీ.. దాక్కుంటే లాక్కొచ్చి కొడతాం అంటూ ఇప్పటి హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. వైసీపీ నేతలు పవన్ కు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. అంతేకాదు గాంధీ జయంతి రోజున పవన్ చేపట్టే శ్రమధానానికి చెక్ పెట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇటీవలే రోడ్ల దుస్థిపై జనసేన పోరాటం కూడా ప్రారంభించింది. గుంతలున్న రోడ్ల దగ్గర నిరసనలు సైతం వ్యక్తం చేసింది. ఈ రహదారుల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు నాలుగు వారాల్లో వాటికి మర్మమ్మతులు చేపట్టాలని డెడ్ లైన్ కూడా విధించింది. స్పందించిన ప్రభుత్వం వర్షాలు తగ్గిన తర్వాత మరమ్మతులు చేపడతామని వెల్లడించింది. ఇప్పుడు మరమ్మతులు నిర్వహించినా ఫలితం ఉండదని చెప్పింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి