ఏపీ బీజేపీలో సోము వీర్రాజు వన్ మ్యాన్ షో నడుస్తుందా? అంటే అవును వీర్రాజు వన్ మ్యాన్ షో కామెడీ నడుస్తోందని సెటైర్లు వస్తున్నాయి. అదేంటి ఇప్పుడు అంతలా వీర్రాజు కామెడీ ఏం చేశారని అనుకోవచ్చు. ఆయన మామూలుగా మాట్లాడిన మాటలే పెద్ద కామెడీ అయిపోయాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇంతకాలం వీర్రాజు దూకుడుగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు మాత్రం చేయలేదు. ఏదో పరోక్షంగా విమర్శలు చేశారు తప్ప, జగన్ పేరు చెప్పి ఎప్పుడు మాట్లాడలేదు. అలాగే ఇతర వైసీపీ మంత్రులకు సైతం కౌంటర్లు ఇచ్చిన పరిస్తితి లేదు.

కాకపోతే ఈయన ఎంతసేపు చంద్రబాబు పేరు తీస్తూ విమర్శలు చేసేవారు. సరే ఇంతకాలం అదే పరిస్తితి కొనసాగుతూ వచ్చింది. కానీ ఇటీవల సీన్ మారింది..బీజేపీ నేతల వైఖరిలో మార్పు వచ్చింది. అలాగే సోము వీర్రాజులో కూడా చాలా మార్పు కనిపిస్తోంది. డైరక్ట్‌గా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయాల్సిన పరిస్తితి వచ్చింది. ఇటీవల ఏపీకి అమిత్ షా వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. జగన్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు ఎటాక్ మొదలుపెట్టారు.


తాజాగా ప్రజాగ్రహ సభ పెట్టి మరీ జగన్‌పై విరుచుకుపడ్డారు. జగన్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని, అప్పులు పెంచేశారని, రాజధాని అమరావతిని దెబ్బతీశారని, ఇంకా అనేక రకాలుగా విమర్శలు చేశారు. సరే ఇంతవరకు అంతా బాగానే ఉంది..కానీ సోము మాటలు కొన్ని కామెడీగా అయిపోయాయని అంటున్నారు. బీజేపీకి అధికారం ఇస్తే మూడేళ్లలోనే అమరావతిని కట్టేస్తామని అన్నారు. అలాగే మద్యం ధరలని తగ్గించి అమ్ముతామని, చీప్ లిక్కర్ రూ.70లకే ఇస్తామని మందుబాబులకు హామీ ఇచ్చారు.

దీంతో సోముపై సెటైర్లు పడుతున్నాయి. అసలు బీజేపీకి అధికారంలోకి వచ్చే సీన్ ఉందా? అని డౌట్ పడుతున్నారు. అలాగే సోము వీర్రాజు కాదని, సారాయి వీర్రాజు అంటూ కమ్యూనిస్ట్ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఆఖరికి పక్కన తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం సోము వ్యాఖ్యలపై సెటైర్లు వేస్తున్నారు. ఇలా కామెడీలో సోము వన్ మ్యాన్ షో చేస్తున్నారని కౌంటర్లు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: