ఈ విషయమే విచిత్రంగా ఉంది. ఒకరికేమో పది సీట్లు సంపాదించుకోవటానికి పవన్ కల్యాణ్ సహకారం అవసరం. మరొకరికేమో అధికారం అందుకోవటం జీవన్మరణ సమస్యగా మారిపోయింది. ఇందుకు పవన్ను నిచ్చెనగా ఉపయోగించుకోవటం చాలా అవసరం. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరో అర్ధమైపోయుంటుంది. వారే ఇటు బీజేపీ అటు చంద్రబాబునాయుడు. ప్రస్తుతానికి బీజేపీ-జనసేన మిత్రపక్షాలే అనటంలో సందేహంలేదు.





అయితే వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ పరిణామాలు ఎలా మారిపోతాయో ఎవరు ఊహించలేరు. ఎందుకంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవాలంటు పదే పదే చంద్రబాబు నుండి పవన్ కు లవ్ ప్రపోజల్స్ వస్తున్నాయి. నిజానికి జనసేన పదిసీట్లు గెలవాలంటే చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటేనే సాధ్యం. 1 శాతం ఓట్లు కూడా లేని బీజేపీతో పొత్తువల్ల వపన్ కు ఎలాంటి ఉపయోగమూ ఉండదు. కాకపోతే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం వల్లే పవన్ కమలంపార్టీకి మిత్రపక్షంగా ఉన్నారు. మరి వీళ్ళద్దరి మిత్రత్వం ఎంత కాలం ఉంటుందో పవనే చెప్పాలేమో. ఆ ముచ్చట కోసమే చంద్రబాబు ఎదురుచూస్తున్నారు.  





రాబోయే ఎన్నికలే చంద్రబాబుకు దాదాపు చివరి ఎన్నికలనే చెప్పచ్చు. ఎందుకంటే రాజకీయంగా చివరి అంకంలోకి చంద్రబాబు ఎంటరైపోయారు. ఇపుడు చంద్రబాబుకు 73 ఏళ్ళు. 2024 ఎన్నికల నాటికి 75 అవుతుంది. అప్పుడు గనుక అధికారంలోకి రాకపోతే చంద్రబాబు రాజకీయ జీవితం దాదాపు ముగిసిపోయినట్లే. అందుకనే ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి తీరాలన్నది చంద్రబాబు కల.





ఆ కల ఒంటరిగా పోటీచేస్తే సాధ్యంకాదు కాబట్టే పవన్ తో పొత్తుకు తహతహ లాడుతున్నారు. అంటే పది సీట్లు గెలవాలన్నది బీజేపీ కల అయితే మళ్ళీ అధికారంలోకి రావాలన్నది చంద్రబాబు కల. కాబట్టే ఇటు బీజేపీ అయినా అటు చంద్రబాబుకు అయినా పవనే వాంటెడ్ పర్సన్ గా మారిపోయారు. మరి వచ్చే ఎన్నికలకు  సంబంధించి  పవన్ మనసులో ఏముందో ఎవరికీ తెలీదు. మొత్తానికి పవన్ కు డిమాండ్ బాగా పెరిగిపోతోందనటంలో సందేహంలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: