ఏపీలో వివాదాల్లో లేని మంత్రి ఎవరైనా ఉన్నారా? ఈ రెండున్నర ఏళ్లలో కేవలం ప్రజల కోసమే పనిచేస్తూ...ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా, మంచిగా పనితీరు కనబరుస్తూ...మంచి మంత్రి అని ఎవరైనా అనిపించుకున్నారా? అంటే ఏమో వివాదాల్లో లేకుండా ఏ మంత్రి ఉన్నారో చెప్పడం కష్టమనే పరిస్తితి ఉంది. ఎందుకంటే మంత్రులు ఏదొక వివాదంలో ఉంటూనే ఉన్నారు. రాష్ట్రంలో 25 మంత్రులు ఉన్నారు..మరి 25 మంత్రుల్లో దాదాపు అందరూ వివాదాల్లోనే ఉన్నట్లు కనిపిస్తున్నారు. కొడాలి నాని ఎలాంటి వివాదాల్లో ఉన్నారో చెప్పాల్సిన పని లేదు.

ఇక మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేరు...ఆలయాల్లో అక్రమాల్లో వినిపిస్తూ ఉంటుంది...ఆలయాలపై దాడులు ఈయనకు బ్యాడ్ నేమ్ తీసుకొచ్చాయి...అటు మంత్రి పేర్ని నానిపై కూడా పలు విమర్శలు వచ్చాయి. అవంతి శ్రీనివాస్ ఎలాంటి వివాదంలో ఉన్నారో చెప్పాల్సిన పని లేదు. గుమ్మనూరు జయరాం అయితే అవినీతి, అక్రమాలు చేయడంలో ముందు ఉన్నారని టీడీపీ ఆరోపిస్తూనే ఉంది. అటు అనిల్ కుమార్ యాదవ్‌పై ఎప్పుడు ఏదొక విమర్శ వస్తూనే ఉంటుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ అక్రమ మైనింగ్ ఆరోపణలు చేస్తుంది.

 
ఇక శంకర్ నారాయణ్, పుష్పశ్రీ వాణి, చెల్లుబోయిన వేణుగోపాల్, వనిత, విశ్వరూప్ లాంటి వారు మంత్రులుగా ఉన్నారా? అనే డౌట్ జనాలకు వస్తుంది. అలాగే సుచరిత పేరుకే హోమ్ మంత్రి అనే విమర్శ ఎదురుకుంటున్నారు. ఆర్ధిక మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్ర...అప్పులు మంత్రి అయ్యారు. బాలినేని శ్రీనివాస్, ఆదిమూలపు సురేష్, ఆళ్ళ నాని, రంగనాథరాజు, నారాయణస్వామి, ధర్మాన కృష్ణదాస్, అప్పలరాజు లాంటి వారు ఏదొక వివాదంలో వినిపిస్తూనే ఉన్నారు.

కానీ ఏ వివాదంలో లేకుండా మంత్రి ఎవరైనా ఉన్నారంటే..అది మేకపాటి గౌతమ్ రెడ్డి అని చెప్పొచ్చు...ఈయన అక్రమాలు చేసినట్లు ప్రతిపక్ష టీడీపీ ఎప్పుడు ఆరోపించలేదు. అలాగే మేకపాటి...ప్రతిపక్షాలని ఇష్టమొచ్చినట్లు తిట్టిన సందర్భాలు లేవు...కొద్దో గొప్పో పనిచేస్తున్నట్లు కనిపిస్తారు..మొత్తానికి ఏపీలో ఉన్న మంత్రుల్లో మేకపాటి గౌతమ్ రెడ్డి కాస్త బెటర్ అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: