ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త మార్పులు చేసుకుంటూ ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా డెల్టాక్రాన్ వేరియంట్ వార్తల్లో నిలిచింది. ఇది డెల్టా, ఒమిక్రాన్ లక్షణాలను ప్రదర్శిస్తోంది. యూకేలో కోవిడ్ పాజిటివ్ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించగా.. ఈ డెల్టాక్రాన్ లక్షణాలను గుర్తించారు. అయితే దీని వ్యాప్తి, తీవ్రత గురించి అధికారిక స్పందన రాలేదు. ఫస్ట్ ఈ వేరియంట్ ను యూరప్ లోని సైప్రస్ లో గుర్తించారు.
ప్రపంచ నలుమూలలా వ్యాపించిన కరోనా 10దేశాల్లోకి ప్రవేశించలేకపోయింది. ఇందులో ఎక్కువగా మహాసముద్రాల ద్వీప దేశాలే ఉన్నాయి. తువాలు, టోకిలౌ, సెయింట్ హెలెనా, పిట్ కెయిర్న్ ఐలాండ్స్, నియూ, నౌరు, మైక్రోనేషియా తో పాటు ఉత్తరకొరియా, తుర్క్ మెనిస్తాన్ దేశాల్లో ఇప్పటి వరకు అధికారికంగా ఒక్క కరోనా కేసు కూడా నమోదవలేదు. అయినప్పటికీ ఈ దేశాల్లో కఠిన నిబంధనలు అమలు చేయడంతో పాటు అధిక వ్యాక్సినేషన్ జరిగింది.
ఇక భారత్ బయోటెక్ తయారు చేస్తున్న ముక్కు ద్వారా వేసుకునే టీకా.. క్లినికల్ ట్రయల్స్ ను విశాఖలోని విమ్స్ లో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం టీకా మూడో దశ క్లినికల్ పరీక్షలు చేస్తున్నట్టు విమ్స్ డైరెక్టర్ రాంబాబు తెలిపారు. ఈవ్యాక్సిన్ చుక్కల రూపంలో ఉంటుందన్నారు. ఫలితాలను ఐదు నెలల్లో అందిస్తామని చెప్పారు. ఇంజెక్షన్ టీకా కంటే చుక్కల వ్యాక్సిన్ ద్వారా శరీరంలో ఎక్కువ యాంటిబాడీలు ఉత్పత్తి అవుతాయన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి