ప్రకృతి వైపరీత్యాలు రావడానికి సమయం సందర్భం అన్నది ఉండదు. అయితే ఒక్కసారి వచ్చాయా ఎవ్వరూ వీటిని అడ్డుకోలేరు, అంతలా మానవ జాతిపై పగపడుతుంది ఈ ప్రకృతి. ఇంతకు ముందు చాలా సార్లు భయంకరమైన తుపాన్ లు వచ్చి ప్రజలను అతలాకుతలం చేశాయి. అయితే మల్లె అలంటి తుఫాన్ ఒకటి రానుందని తెలుస్తోంది. ఇప్పుడు తుఫాను ముంచుకొస్తుంది అని వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. కేంద్ర వాతావరణ శాఖ ప్రకటన మేరకు వేసవిలో తొలి తుపాను రానున్నట్లు సమాచారం అందింది. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారింది అని వాతావరణ శాఖ తెలిపింది.

ప్రస్తుతం ఈ వాయుగుండం ఉద్రిక్తత పెరిగిందని పెనువేగంతో ముంచుకొస్తుంది అని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ తుఫాన్ గాలులు గంటకు 13 కిలోమీటర్ల వేగంతో తీరం వైపుకు దూసుకు వస్తున్నాయి అని తెలిపింది. ప్రస్తుతం ఈ వాయుగుండం తమిళనాడు లోని నాగ పట్టణానికి 320 కిలోమీటర్ల దూరంలో కదులుతోంది అని సమాచారాన్ని అందించింది. ఇపుడు అది కాస్తా దిశను మార్చుకుని తమిళనాడు వైపు వస్తున్నట్లు పేర్కొంది. తీవ్రంగా మారిన ఈ తీవ్ర వాయు గుండం కారణంగా  కోస్తాంధ్ర తీరం, తమిళనాడు వైపు బలమైన ఈదురు గాలులు వేసే అవకాశం ఉందని పేర్కొంది .

అదే విధంగా తమిళనాడు, దక్షిణకోస్తా, రాయలసీమ,  ప్రాంతాల్లో వర్షాలు సైతం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపింది.  తుఫాను సూచన కారణంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. అదే విధంగా ఈ వాయుగుండం ఉద్రిక్తత మరింత పెరిగితే తుఫాను ప్రభావం పలు పరిసర ప్రాంతాల పై కూడా ఉంటుందని అధికారులు ముందస్తు జాగ్రత్తలు చెబుతున్నారు. మరి ఈ తుఫాన్ ముప్పు తప్పుతుందా లేదా రాబోయే కొన్ని గంటల్లో వర్షంగా మారుతుందా తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: