ఒకప్పుడు ఉన్న సదుపాయాలకు నేటి రోజుల్లో ఉన్న సదుపాయాలకు ఎంత తేడా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటి లాగానే ఒకప్పుడు కూడా అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. కానీ మనం వున్న చోటికి అవి రావటం  కాదు.. అవి ఉన్న చోటికి మనం వెళ్లి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం మనం ఎక్కడ ఉంటే అక్కడ నిమిషాల వ్యవధిలో మనకు కావాల్సిన వస్తువు తెచ్చేందుకు ఎన్నో హోం డెలివరీ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కాళ్లకు వేసుకునే చెప్పులు దగ్గరనుంచి  దర్జాగా తిరిగే కార్ ల వరకు అన్ని హోమ్ డెలివరీ అవుతూ ఉన్నాయి.


దీంతో ఏదైనా కొనుగోలు చేయాలంటే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండానే పోయింది అని చెప్పాలి. హోమ్ డెలివరీ సదుపాయాలను ప్రతి ఒక్కరూ కూడా కాస్త గట్టిగానే వినియోగించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం అన్ని రకాల వస్తువులు హోమ్ డెలివరీ సదుపాయం కలిగి ఉన్నాయి. అలాగే మద్యం కూడా హోం డెలివరీ ఉంటే ఎంత బాగుండు అని కోరుకునే వారు లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇక త్వరలో ఇలాంటి సదుపాయం కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అన్నది తెలుస్తుంది.


 త్వరలో మద్యం ప్రియుల అందరికీ ఢిల్లీ ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధం అవుతుంది అన్నది తెలుస్తుంది మద్యం హోమ్ డెలివరీ ప్రతిపాదనకు ఇటీవలే కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. రిటైలర్ లిక్కర్ షాప్ లో మద్యం ధరలపై ఇచ్చే డిస్కౌంట్ పై కూడా ఎలాంటి ఆంక్షలు విధించ కూడదు అని అటు ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించుకుందట. ఈ విషయాన్ని ఇటీవలే మంత్రుల బృందం ధృవీకరించడం గమనార్హం.  దీంతో అతిత్వరలో మద్యం హోం డెలివరీ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది అని తెలుస్తూ ఉంది. ఇది నిజంగా మందుబాబులు అందరికీ ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: