మోడీ ప్రభుత్వం కొత్త స్కీమ్ లను అందుబాటులోకి తీసుకొని వస్తుంది. ఇప్పటికే ఎన్నో పథకాలను అందుబాటులోకి వచ్చాయి.అన్నీ కూడా మంచి లాభాలను ఇస్తున్నాయి.దాంతో చాలా మంది ఈ స్కీమ్ ల కోసం ఆసక్తి చూపిస్తున్నారు..ఇప్పుడు మరో స్కీమ్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చారు.బ్యాంకులు, పోస్టాఫీసుల్లో వివిధ రకాల బీమా పాలసీలను అందిస్తోంది. ఏదైనా ప్రమాదంలో ఇంటి యజమాని మరణించినట్లయితే కుటుంబానికి ఆసరాగా ఉండే విధంగా పథకాలను రూపొందిస్తోంది..



కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ పథకాల్లో ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఒకటి. ఈ పథకం ద్వారా రూ.2 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు.ఈ ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది ఇన్సూరెన్స్ స్కీమ్. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్లో చేరిన వారికి నామమాత్రపు ప్రీమియం చెల్లింపుతో రూ.2 లక్షల వరకు జీవిత బీమా కవరేజ్ లభిస్తుంది. అంటే ప్రతికూల పరిస్థితుల్లో పాలసీ దారుడు మరణిస్తే.. వారి కుటుంబానికి రూ. 2 లక్షలు లభిస్తాయి.


ఇకపోతే ఏడాదికి రూ.436 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఇన్సూరెన్స్ ప్రీమియం, ఏజెంట్ కమిషన్ రూ, అడ్మినిస్ట్రేటివ్ చార్జీలు కలిసి ఉంటాయి. అయితే గతంలో ఈ ప్రీమియం రూ.330 ఉండగా, ఇటీవల దీనిని రూ.436కు పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకాన్ని కేంద్రం 2015లో ప్రవేశపెట్టింది.బ్యాంక్ అకౌంట్ ఉన్న వారు ఆటో డెబిట్ సదుపాయం కూడా పెట్టుకోవచ్చు...



ఈ స్కీమ్ లో చేరాలంటే కొన్ని అర్హతలు కూడా ఉన్నాయి.పాలసీదారుడికి 18 నుంచి 50 ఏళ్ల వరకు వయసు ఉండాలి. అలాగే బ్యాంకు అకౌంట్ ఉండాలి. ఆధార్ కార్డు తప్పనిసరి.పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీ టర్మ్ ఏడాది. మీరు ప్రతి ఏడాది రూ.436 చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు పాలసీ రెన్యూవల్ అవుతూ వస్తుంది. ఇలా డబ్బులు కట్టి పాలసీ తీసుకున్న వారు ఏ కారణం చేతనైనా మరణిస్తే..వారి కుటుంబ సభ్యులకు రూ.2లక్షలను పొందవచ్చు...

మరింత సమాచారం తెలుసుకోండి: