వివేకానందరెడ్డి మర్డర్ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టుచేసిందా ? అరెస్టుచేసి వెంటనే విడుదలచేసిందా ? వినటానికి ఈ విషయం ఆశ్చర్యంగానే ఉంది. మర్డర్ కేసులో సీబీఐ దాఖలుచేసిన అఫిడవిట్ లో తాము అవినాష్ రెడ్డిని ఈనెల 3వ తేదీన అరెస్టుచేసినట్లు చెప్పింది. అరెస్టుచేసిన వెంటనే రు. 5 లక్షల చొప్పున రెండు ష్యూరిటీలను తీసుకుని అక్కడికక్కడే, అప్పటికప్పుడే విడుదలచేసినట్లు చెప్పింది. అవినాష్ ను అరెస్టుచేయకుండా హైకోర్టు ముదస్తు బెయిల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సీబీఐ ఎలా అరెస్టుచేసిందో అర్ధంకావటంలేదు.





అరెస్టుచేయటం ఏమిటో ? వెంటనే విడుదలచేయటం ఏమిటో గందరగోళంగా ఉంది. హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సీబీఐ ఎలా అరెస్టు చేసింది ? బెయిలిచ్చినా సీబీఐ అరెస్టుచేసిందంటే ఇక కోర్టు ఆదేశాలకు విలువేముంటుంది ? అరెస్టుచేసి ష్యూరిటీమీద వెంటనే విడుదలచేయాలన్న కోర్టు ఆదేశాల మేరకే సీబీఐ అరెస్టుచేసి విడుదలచేసినట్లు ఎల్లోమీడియా చెప్పింది. ష్యూరిటీల మీద వెంటనే విడుదలచేసేట్లయితే ఇక అరెస్టుచేయటం ఎందుకు ? అరెస్టునుండి తప్పించుకునేందుకు అవినాష్ అంత అవస్తలు ఎందుకు పడతారు ?





హత్యకేసులో అవినాష్ ను అరెస్టుచేసి ఏ8వ నిందితుడిగా చేర్చినట్లు సీబీఐ అఫిడవిట్లో చెప్పింది. సరే అవినాష్ ను అరెస్టుచేస్తే చేసింది మరీ విషయాన్ని ఎందుకింత రహస్యంగా దాచిపెట్టినట్లు ? అరెస్టు చేయటానికి ప్రయత్నించినపుడేమో విపరీతమైన హడావుడిచేసిన విషయం గుర్తుండేవుంటుంది. అప్పట్లో అరెస్టు సాధ్యంకాలేదనే అనుకుందాం, తర్వాతయినా అరెస్టుచేసింది కదా. అరెస్టుచేసిన విషయాన్ని అంత రహస్యంగా దాచిపెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ?





అరెస్టయిన విషయం బయటకు చెప్పుకుంటే పరువుతక్కువ అని ఎంపీ అనుకునుండచ్చు. కాబట్టి ఎంపీ బయటకు చెప్పలేదనే అనుకుందాం. మరి సీబీఐ ఎందుకు ప్రకటించలేదు ? ఆ విషయాన్ని ఇన్నిరోజుల తర్వాత  కోర్టులో ఇపుడు ఎందుకు చెప్పింది ? ఎంపీ అరెస్టు, పూచికత్తులు, విడుదల, కోర్టు అఫిడవిట్లో చెప్పటం కాస్త గందరగోళంగానే ఉంది. మరిదీనిపై ఎప్పటికి క్లారిటి వస్తుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: