
ఏకంగా 64 స్థానాలలో విజయం సాధించిన కాంగ్రెస్ మరికొన్ని రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అని చెప్పాలి. ఎన్నికల ఫలితాలలో ఆయా అభ్యర్థుల జయాపజయాల పై ఉదయం నుంచి అటు ఉత్కంఠ నెలకొంది అని చెప్పాలి. అయితే గత ఎన్నికల్లో భారీ మెజారిటీ మెజారిటీ సాధించిన పొలిటీషియన్స్ సైతం ఈ ఎన్నికల్లో ఓడిపోవడం.. అతి తక్కువ మెజారిటీతోని సరిపెట్టుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే ఇటీవలే విడుదలైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఎవరు అత్యధిక మెజారిటీ సాధించారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.
ఆ వివరాలు చూసుకుంటే.. కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన వివేకానంద ఈ ఎన్నికల ఫలితాలలో అందరికీ మించిన మెజారిటీని సాధించారు. 85576 ఓట్ల తేడాతో బిజెపి అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ పై విజయం సాధించారు.
హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గంలో 82,308 ఓట్ల తేడాతో విజయం అందుకున్నారు.
ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ చంద్రయాన్ గుట్ట నియోజకవర్గంలో 81,660 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
టిఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు కూకట్పల్లి నియోజకవర్గం లో 70 వేల 387 ఓట్ల తేడాతో గెలిచారు.
కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం నకిరేకల్ నియోజకవర్గంలో 68,838 ఓట్ల తేడాతో గెలిచారు
కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ సాగర్ రావు మంచిర్యాలలో 66,116 ఓట్ల తేడాతో గెలిచారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి జై వీర్రెడ్డి 55,849 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 54,332 ఓట్ల తేడాతో విజయం సాధించారు.