పాలస్తీనాకి సంబంధించిన గాజా లోని ఒక  ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్‌మెంట్  హమాస్.  హమాస్ అని పిలువబడే  'హర్కత్ అల్ ముఖావమా అల్-ఇస్లామియా'  ఒక ఉగ్రవాద సంస్థ. పాలస్తీనాలోని కీలకమైన రెండు రాజకీయ పక్షాల్లో హమాస్ ఒకటి. అయితే ఈ మధ్య ఇజ్రాయిల్ పై దాడి చేసినప్పుడు అమెరికా, యూరప్ దేశాలకు, అలాగే రష్యా కు సంబంధించిన వాళ్లని కూడా బంధించారు హమాస్ తీవ్రవాదులు.


అలా ఆయా దేశాలకు సంబంధించిన 240 మందిని పాలస్తీనాలోని శిబిరాలలో బంధించారు హమాస్ తీవ్రవాదులు. ఇలా వీళ్ళను బంధించి ఆయా దేశాలతో బేరసారాలు మాట్లాడుకుని  ఇజ్రాయిల్ యుద్ధాన్ని ఆపడమే వీళ్ళ ఎత్తుగడ. దీనిలో భాగంగానే అమెరికా, యూరప్, రష్యా దేశాలకు సంబంధించిన వాళ్ళని ఒక పక్కన వాళ్ళ దేశాలకు వదిలిపెడుతున్నారు ఇలా వదులుతూనే మేము అమెరికా, యూరప్, రష్యా దేశాలకు సంబంధించిన వాళ్లను ఉదారంగా వదిలిపెట్టేస్తున్నామంటూ చెప్పుకొస్తున్నారు.


ఇలా వాళ్ళు చెప్పడం ద్వారా ఆయా దేశాల వాళ్ళు తమ వైపు నిలబడతారని అనుకుంటున్నారు హమాస్ తీవ్రవాదులు. అయితే విషం కక్కే పాము మంచిగా నటిస్తుందంటే దాని వెనుక అది చేసే కుట్ర తెలియంది కాదు ఆయా దేశాలకు. ఇలా ఆయా దేశాలకు సంబంధించిన బందీలను వదిలేస్తే అమెరికా ఇజ్రాయిల్ కు ఎటువంటి సాయం చేయదని అనుకున్నారు ఈ హమాస్ తీవ్రవాదులు. అయితే ఎంతమందిని వదిలేసినా కూడా ఇజ్రాయిల్ కి సంబంధించిన 100మందిని మాత్రం వాళ్ళ దగ్గర బంధించి ఉంచారు వీళ్లు.


వాళ్లని చూపించి ఇజ్రాయిల్ ని భయపెట్టి ఆ పైన అమెరికా ద్వారా కథ నడిపిద్దాం అనుకున్న హమాస్ వాళ్లకి అమెరికా పెద్ద షాకే ఇచ్చింది. అదేంటంటే అమెరికా ఇజ్రాయిల్ కు భారీగా ఆయుధాలను పంపిణీ చేస్తూ ఉండడం. ఇదే విషయాన్ని ఇజ్రాయిల్ కూడా అంగీకరించింది కూడా. దాదాపు రెండు నెలల వ్యవధిలో 10వేల టన్నుల ఆయుధాలను హమాస్ తీవ్రవాదులను తుద ముట్టించడానికి ఇజ్రాయిల్ కి ఇచ్చిందట అమెరికా.

మరింత సమాచారం తెలుసుకోండి:

usa