ఆంధ్రాలో ఎన్నికల రాజకీయం రోజు రోజుకి ఎలా మారుతుందో చూస్తూనే ఉన్నాము.. ముఖ్యంగా షెడ్యూల్ విడుదల కావడంతో పార్టీలు ప్రచారం పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. ఇటీవలే ఎన్డీఏ కూటమి మొదటి సభ నిన్నటి రోజున జరిగింది. ఇప్పటికే బిజెపి జనసేన టిడిపి మూడు పార్టీల మధ్య సీత సర్దుబాటు జరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం సీటును మొదట టిడిపి మహాసేన రాజేష్ కు ఇవ్వడం జరిగింది.ఆ తర్వాత మార్పు చేయాలని నిర్ణయించడంతో ఈ వ్యవహారం పైన రాజేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.


టిడిపి జనసేన బిజెపి పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు పైన ఇప్పటికే ఒక నిర్ణయం జరిగిందని టిడిపి తొలి జాబితాలో 94 రెండో జాబితాలు 34 స్థానాలలో అభ్యర్థులను ప్రకటించారు. అలా మొదటి జాబితాలోని పి గన్నవరం స్థానాన్ని మహాసేన రాజేష్ కు ఇచ్చారు. ఈ ప్రకటనపై జనసేన సైనికులు ఇతర అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవడంతో ఆ తర్వాత మహా సేన రాజేష్ పోటీ నుంచి తప్పుకున్నట్లుగా ప్రచారం చేశారు అయితే అధికారికంగా ఇంకా ఎక్కడ ప్రకటించలేదు.

పొత్తులో భాగంగా గన్నవరం సీటును జనసేనకు ఇవ్వాలని టిడిపి నిర్ణయించుకున్నట్టుగా సమాచారం.ఈ విషయం పైన రాజేష్ మాట్లాడుతూ గన్నవరంలో తనను తప్పించినట్లుగా చంద్రబాబు చెప్పలేదని టిడిపి జనసేన తనను అవమానిస్తున్నట్టుగా ఉందంటూ వెల్లడించారు..ప్రస్తుతం మూడు పార్టీలు పొత్తులో ఉన్నాయని తనను తప్పించినట్లుగా చెప్పకుండానే జనసేన అభ్యర్థుల పేరుతో పి గన్నవరంలో ఐవిఆర్ఎస్ కాల్స్ పేరుతో సర్వేలు చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వెల్లడించారు.. ఇక్కడ తాను ఇన్చార్జిగా ఉంటుందని గుర్తు చేస్తున్నానని చంద్రబాబు తనకు సీటు లేదు పక్కన ఉండు అని చెప్పే వరకు ఉండాలి కదా అంటూ తమ పార్టీ పైన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ మహాసేన రాజేష్. ఒకవేళ ఈ సీట్ జనసేన కోరుతూ ఉంటే తనని అవమానించినట్టే అంటూ వెల్లడించారు అందుకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది

మరింత సమాచారం తెలుసుకోండి: