ప్రకటించిన అభ్యర్ధుల జాబితా ప్రకారమైతే జగన్మోహన్ రెడ్డి బీసీ సామాజికవర్గాలకు పెద్ద పీట వేశారన్నది వాస్తవం. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో 59 టికెట్లను బీసీలకు కేటాయించారు. ఇంతపెద్ద సంఖ్యలో బీసీలకు ఏ పార్టీ కూడా టికెట్లు ఇవ్వలేదన్నది నిజం. 25 పార్లమెంటు సీట్లలో 11, 175 నియోజకవర్గాల్లో 48 స్ధానాలను బీసీలకు జగన్ కేటాయించారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన టికెట్లకన్నా బీసీలకు రాబోయే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కేటాయించారు. ఇక్కడ కీలకమైన ప్రశ్న ఏమిటంటే సీట్లు కేటాయించినంత మాత్రాన బీసీ సామాజికవర్గాలన్నీ వైసీపీకి ఓట్లేసేస్తాయా ?





ఐదేళ్ళు అధికారంలో ఉన్న పార్టీ మీద ఎంతోకొంత జనాల్లో వ్యతిరేకత ఉండటం సహజం. ఆ పద్దతిలోనే జగన్ ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత ఉంది. అయితే ఆ వ్యతిరేకత ఏ స్ధాయిలో ఉందన్నది స్పష్టంగా తెలియటంలేదు. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ పదేపదే ఆరోపిస్తున్నట్లుగా, చెబుతున్నట్లుగా అర్జంటుగా వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లేసి జగన్ను దింపేయాలన్నంత కసితో జనాలు ఉన్నారా అన్నది అనుమానమే. ఇదే సమయంలో బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చింది కాబట్టి బీసీలందరు వైసీపీకి ఓట్లేసి గెలిపిస్తారని కూడా అనుకునేందుకు లేదు.





దీనికి ప్రధాన కారణం ఏమిటంటే తొందరలో జరగబోయే ఎన్నికల్లో ప్రత్యేకించి ఏ పార్టీకి కూడా అనుకూలంగా కాని లేదా వ్యతిరేకంగా కాని బలమైన గాలి ఏమీలేదు. కాబట్టి పార్టీల బలాబలాలు, అభ్యర్ధుల బలం, బలహీనతలే గెలుపోటముల్లో కీలకపాత్ర పోషిస్తుంది. పోటీచేస్తున్న అభ్యర్ధుల్లో ఎవరైతే ఎలక్షనీరింగును ఎఫెక్టివ్ గా మ్యానేజ్ చేసుకుంటారో వాళ్ళకే గెలుపు అవకావాలు ఎక్కువగా ఉంటాయి. ఇదే సమయంలో బీసీల్లోని 139 ఉపకులాల్లో జగన్ టికెట్లు కేటాయించింది 18 ఉపకులాలకు మాత్రమే. మరి మిగిలిన 121 ఉపకులాల మాటేమిటి అనే చర్చ జరుగుతోంది.





పార్టీ కూడా 139 ఉపకులాలకు టికెట్లు ఇవ్వలేందు. కాని నేతల ఆశలు, ఆకాంక్షలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పలానా ఉపకులాలనికి టికెట్ ఇచ్చిన జగన్ తమను నిర్లక్ష్యంచేశారని అంటారే కాని టికెట్ ఎందుకు ఇవ్వలేకపోయారనే లాజిక్కును ఆలోచించరు. ఎందుకంటే రాజకీయాల్లో అన్నీసార్లు లాజిక్కులు పనిచేయవు. ప్రత్యేకించి టికెట్ల కేటాయింపులో లాజిక్కులను సామాజికవర్గాలు అసలు పట్టించుకోవు. మరి 121 బీసీ ఉపకులాలు ఏమేచేస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: