ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వాడి వేడిగా సాగుతుంది. అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించేందుకు  చంద్రబాబు తన రాజకీయ అనుభవాన్ని మొత్తం ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీని ఒంటరిగా ఎదుర్కోలేమని భావించి పొత్తుల వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అటు జనసేనతో పొత్తు ఉండనే ఉంది. కొత్తగా బిజెపితో కూడా పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు. ఈ క్రమంలోనే సీట్లను పంచుకునేందుకు కూడా సిద్ధమయ్యారు.


 కానీ చంద్రబాబు మాస్టర్ మైండ్. ఎప్పుడు ఏం చేస్తారన్నది అస్సలు ఊహించలేం. ఇక ఇప్పుడు పొత్తుల విషయంలో కూడా ఇలాగే ముందుకు సాగుతున్నారట సిబిఎన్. బిజెపితో పొత్తు పెట్టుకుని తనకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే టికెట్లు ఇప్పించడంలో సక్సెస్ అయ్యాడు చంద్రబాబు. కానీ రఘురామకృష్ణం రాజు మాత్రం టికెట్ దక్కలేదు. అయితే ఇలా ఆర్ఆర్ఆర్ కి టికెట్ దక్కలేదని గగ్గోలు పెడుతున్నారు కొంతమంది జనాలు. ఇలాంటి వారిలో టిడిపి శ్రేణులే ఎక్కువగా ఉన్నారు. ఇక మరోవైపు ఇక టీడీపీ అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి ఆర్ఆర్ఆర్ కు సీటు ఇవ్వకపోవడంతో  బిజెపిపై కాస్త నెగెటివిటీ కూడా ఎక్కువ అవుతుంది.


 ఇంకోవైపు ఇక పొత్తు పెట్టుకున్నందుకు బిజెపికి కొన్ని సీట్లు కేటాయించాలి. ఇలా కేటాయించిన సీట్లలో బిజెపి గెలవలేదంటే.. ఆ సీట్లను వైసీపీ తన్నుకు పోతుంది. అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ చంద్రబాబు మాస్టర్ మైండ్ వ్యూహాలను పన్నుతున్నారట. కొన్నాళ్ల వరకు సైలెంట్ గా ఉండి ఎన్నికలు దగ్గరికి వచ్చాక పరిస్థితులను బట్టి తమ అభ్యర్థులను ఏకంగా రెబల్స్ గా సైలెంట్ గా పోటీలోకి దింపాలని పన్నాగాలు పన్నుతున్నాడట చంద్రబాబు. బిజెపి అభ్యర్థులను కాదని యాంటీ వైకాపా ఓటును తమ వైపుకు తిప్పుకోగల సత్తా ఉన్న వారిని రంగంలోకి దింపుతారని ప్రచారం జరుగుతోంది. పొత్తు ప్రకారం భాజపాకు కొన్ని సీట్లు ఇచ్చిన.. ఎట్టి పరిస్థితులు అక్కడ వైకాపా గెలవకుండా ఉండడానికి ఏం చేయాలి అనే విషయంపై చంద్రబాబు దృష్టి పెట్టాడు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap