ప్రముఖ బ్యాడ్మింటన్ సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇటీవల కాలంలో తన భర్త నుంచి విడాకులు తీసుకున్నప్పటినుంచి ఎక్కువగా ఈమె పేరు వినిపిస్తూనే ఉంది.. ఇప్పుడు తాజాగా సానియా మీర్జా లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాదు లోక్సభ స్థానం బిజెపి అభ్యర్థిగా ఉన్న డాక్టర్ మాధవి లత మీద పోటీగా సానియా మీర్జా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగబోతోంది. ఈ విషయం తెలిసి అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా సానియా మీర్జాకి మద్దతు తెలుపుతున్నారు.


బి ఆర్ ఎస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఈమె పలుకుబడికి కాంగ్రెస్ పార్టీ వినియోగించుకోవాలని పక్కా ప్రణాళికలతోనే హైదరాబాద్ లోక్సభకు చెందిన మహిళ ఓటర్లు కూడా ఈమెకు మద్దతు ఉండడంతో ఈమెను అక్కడి నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు.2003 నుంచి టెన్నిస్ క్రీడాకారిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన సానియా మీర్జా అంచలంచలుగా ఎదుగుతూ అంతర్జాతీయ స్థాయిలోనే నెంబర్ వన్ గా నిలబడి దేశానికి మంచి పేరు తెచ్చింది.


సానియా మీర్జా సోదరి కూడా ఆనం మీర్జా ఒక క్రికెటర్.. ఈమె ఎవరో కాదు సీనియర్ కాంగ్రెస్ నేత అజారుద్దీన్ కోడలుగా ఉన్నది.. అందుకే కాంగ్రెస్ పార్టీలో సానియా మీర్జాకి కూడా కాస్త ఎక్కువ పలుకుబడి ఉన్నట్టుగా కనిపిస్తోంది.2021 లో కూడా వైయస్ షర్మిల గారిని కూడా మర్యాదపూర్వకంగా ఆమె కలవడం జరిగింది. అందుకే ఈమె కూడా సానియా మీర్జా హైదరాబాద్ నియోజవర్గం నుంచి పోటీ చేయడానికి ప్రోత్సహిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన చాలామంది కాంగ్రెస్ నేతలు కూడా సానియా మీర్జా హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా ఫలితాలు అనుకూలంగా వస్తాయని భావిస్తున్నారట. ఒకవేళ సానియా మీర్జాకు టికెట్ ఇస్తే మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై ప్రధాన పార్టీలు కూడా మహిళలని పోటీ చేసేలా చేస్తున్నారు. అందుకే మహిళల చేతిలో ఓటమి కాకూడదని మజ్లిస్ చీఫ్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బిఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ కూడా ఇదే స్థానం నుంచి బరిలోకి దిగబోతున్నారు మరి ఎవరికి అనుకూలంగా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: