2024 వ సంవత్సరంలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాన విపక్ష పార్టీ తెలుగుదేశం ... జనసేన , బిజెపి పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి. అందులో భాగంగా ఎక్కువ శాతం సీట్లలో టిడిపి పార్టీ పోటీ చేయనుండగా... ఆ తర్వాత జనసేన, బిజెపి పార్టీలు సీట్లను దక్కించుకున్నాయి. ఇక ఈ పొత్తులో భాగంగా చాలా కాలంగా టిడిపి కోసం పని చేసి కొన్ని ప్రాంతాలలో సీటు దక్కని వారి వల్ల జనసేన, బిజెపి పార్టీలకు ఎదురు దెబ్బలు తలుగుతున్నాయి. ఇకపోతే పొత్తులో భాగంగా జనసేన పార్టీకి అవనిగడ్డలో సీట్ ను ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఇక అవనిగడ్డలో జనసేన కు టికెట్ కన్ఫర్మ్ చేయడంతో అక్కడి టిడిపి పార్టీ సభ్యులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక అవనిగడ్డకు సంబంధించిన టిడిపి వ్యక్తులు రెండు రోజుల క్రితం ఇక్కడి టికెట్ ను టిడిపి క్యాండిడేట్ అయినటువంటి మండల బుద్ధ ప్రసాద్ కి ఇవ్వాలి అని టిడిపి పార్టీ నుండి ఇవ్వడం కుదరనట్లు అయితే అతనిని జనసేన పార్టీలోకి తీసుకొని అయిన ఆయనకు టికెట్ ఇవ్వాలి అని అక్కడి టిడిపి నాయకులు అధిష్టానాన్ని కోరారు.

సాయంత్రం లోపు ప్రకటించినట్లు అయితే మేము ఊరుకోము అని వారు అధిష్టానానికి చెప్పారు. అయిన మండల బుద్ధ ప్రసాద్ పేరును ప్రకటించకపోవడంతో అవని గడ్డ మండలం లోని 50 మంది కి పైగా టిడిపి నాయకులు తమ పార్టీ పదవులకు రాజీనామా చేశారు.  రాజీనామా పత్రాలను మంగళగిరి లోని టిడిపి కార్యాలయానికి కొరియర్ ద్వారా పంపుతున్నట్లు జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరు వెంకటేశ్వరరావు తెలియజేశారు.

మేము జనసేన పార్టీకి వ్యతిరేకులం కాదు. కాకపోతే పొత్తులో భాగంగా ప్రకటించే సీటు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నవారికి ఇవ్వాలి. ఇక్కడ గెలుపు అవకాశాలు ఎక్కువగా మండల బుద్ధ ప్రసాద్ కే ఉన్నాయి. కాబట్టి అతనికి టికెట్ ఇవ్వండి అని ఆయన తెలియజేశాడు. ఇక ఇప్పటి వరకు జనసేన పార్టీ నుండి అవనిగడ్డ సీటు ఎవరికి ప్రకటించలేదు. మరి రాబోయే రోజుల్లో ఇక్కడి నుండి టిడిపి , జనసేన పార్టీలలో నుండి ఎవరు పోటీ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: