తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితమే అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. వాటిలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీని సాధించి తెలంగాణలో ప్రభుత్వాన్ని నెలకొల్పగా ... పది సంవత్సరాల పాటు పవర్ లో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతుంది. ఇక అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయిన చాలా తక్కువ సమయం లోనే పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. దానితో ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ మరియు బిజెపి పార్లమెంట్ ఎన్నికలలో భారీ స్థానాలను దక్కించుకోవాలి అని కసరత్తు చేస్తున్నారు.

ఇలాంటి సమయంలో పాలమూరు లో రసవత్తర పోరు జరుగుతుంది. అది ఈ రోజు తుది అంకానికి చేరుకుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల కోట శాసన మండలి ఉప ఎన్నిక కు నేడు పోలింగ్ జరగబోతోంది. వీటి కోసం ఇప్పటికే ఎన్నికల అధికారులు అని ఏర్పాట్లు చేశారు. ఓటింగ్ లో పాల్గొనే వారికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేశారు. మొత్తం 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

జిల్లా .. డివిజన్ .. నియోజకవర్గ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏ కేంద్రంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు అనే జాబితాను కూడా ఇప్పటికే అధికారులు విడుదల చేశారు. ఈ ఓటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం అయ్యి సాయంత్రం 4 గంటలకు పూర్తి కానుంది. ఈ ఉప ఎన్నికలో మొత్తం ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి , కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి , స్వతంత్ర్య అభ్యర్ధి సుదర్శన్‌ గౌడ్‌ పోటీలో ఉన్నారు.

ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో మొత్తం 1439 మంది ఓటర్లున్నారు. ఇందులో జడ్పీటిసిలు 83 , ఎంపీటీసీలు 888 , మున్సిపల్ కౌన్సిలర్ లు 449 , ఎక్స్ ఆఫీషియో సభ్యులు 19 మంది ఓటర్ లుగా ఉన్నారు. ఇందులో బీఆర్ఎస్ కు 840 స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల బలం ఉంది. కాంగ్రెస్ కు సుమారుగా 450 పైచిలుకు ఓటర్లు ఉన్నారు. ఇక బీజేపీ , ఇతర పార్టీలు , స్వతంత్రులు మరో 100 కు పైగా ఓటర్లు ఉన్నారు. ఇక ఈ లిస్టును బట్టి చూస్తే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బిఆర్ఎస్ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ కాంగ్రెస్ చాలా బలంగా ఈ ఉప్ప ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నాలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: