బీఆర్ఎస్ పార్టీ కి రోజు రోజుకు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇక ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి మరో ఊహించని దెబ్బ తగిలింది . కొన్ని రోజుల క్రితమే ఈ పార్టీ లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన సభ్యుల లిస్టును విడుదల చేసింది . అందులో భాగంగా వరంగల్ ఎంపీ స్థానానికి గాను కడియం శ్రీహరి కూతురు అయినటువంటి కడియం కావ్య ను సెలెక్ట్ చేశారు. అందుకు సంబంధించిన జాబితాను కూడా విడుదల చేశారు.

ఇక అంతా సజావుగా సాగుతున్న సమయం లో కడియం కావ్య ... బీ ఆర్ఎ స్ కి పెద్ద షాక్ ఇచ్చింది. తాజాగా ఈమె బీఆర్ఎస్ పార్టీ అధినేత అయినటు వంటి చంద్రశేఖర్ రావుకు బహిరంగంగా ఓ లేఖను విడుదల చేసింది . అందులో ఈమె ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. అవినీతి ఆరోపణలు, లిక్కర్ స్కామ్ , టెలిఫోన్ టాపింగ్ ఇలా అనేక ఆరోపణల వల్ల బీఆర్ఎస్ పార్టీ పై జనాల్లో నమ్మకం పోయింది.

ఇలాంటి సమయంలో నేను పోటీ చేసిన కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆ కారణం తో నేను వరంగల్ ఎంపీ స్థానం నుండి పోటీ నుండి తప్పుకుంటున్నట్లు ఈమె లేఖలో పేర్కొంది. ఇక కొంతకాలం నుండే కడియం శ్రీ హరి ని కాంగ్రెస్ పెద్దలు కలుస్తున్నట్లు... ఆయనకు కాంగ్రెస్ పార్టీ లోకి రావాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.

ఆ కారణం తోనే కావ్య ... బీ ఆర్ఎ స్ పార్టీ నుండి పోటీ చేయను అని ప్రకటించినట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో కావ్య కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యి ఎంపీ గా పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: