టిడిపిలో గత కొంతకాలంగా అసంతృప్తి సెగలు పెరిగిపోతూనే ఉన్నాయి. ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక విషయం నుంచి పొత్తుల విషయంలో కూడా అసంతృత్యులు కనిపిస్తూనే ఉన్నాయి.. ఇప్పుడు తాజాగా ఇండియన్ హెరాల్డ్ కు తెలిసిన సమాచారం మేరకు.. అనంతపూర్ టిడిపిలో అసంతృప్తులు మొదలయ్యాయి.. టికెట్టు ఆశించి రాకపోవడంతో ఆ అభ్యర్థి యొక్క అనుచరులు టిడిపి కార్యాలయంలో నానా హంగామా సృష్టించారు.. ముఖ్యంగా టిడిపి కార్యాలయం ఫర్నిచర్ ని ధ్వంసం చేస్తూ దహనం చేస్తూ పలు రకాలు నిరసనలు కూడా తెలియజేస్తున్నారు.


ఇండియన్ హెరాల్డ్ అందిస్తున్న కథనం ప్రకారం టిడిపి అధినేత చంద్రబాబు గడచిన కొన్ని గంటల క్రితం పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థి తుది జాబితాను కూడా ఈ రోజున ప్రకటించారు. ఇందులో అనంతపూర్ అభ్యర్థిగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనే పేరును వెల్లడించారు. దీంతో ఈ స్థానం నుంచి టికెట్ ఆశించిన ప్రభాకర్ చౌదరి కి టికెట్ దక్కకపోవడంతో ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.


దీంతో అనంతపూర్ పట్టణంలో ఉండేటువంటి టిడిపి కార్యాలయం, తలుపులను బద్దలు కొట్టి మరి లోపలికి ప్రవేశించి అక్కడ ఫర్నిచర్ ను టిడిపి జెండాను.. చంద్రబాబు ఫ్లెక్సీలను కూడా చింపి దహనం చేశారు. ఇండియన్ హెరాల్డ్ కు అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాకర్ చౌదరి వర్గీయులు చంద్రబాబును తిడుతూ నానా హంగామా చేస్తూ..పలు రకాల నినాదాలతో ముందుకు వెళుతున్నారు. ఈ సమయంలోనే ప్రభాకర్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు గారు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని అసలు కలలో కూడా అనుకోలేదంటూ తెలియజేశారు.


పార్టీ కోసం ఎన్నో ఏళ్లు కష్టపడి రాత్రి పగలు పనిచేసిన నాయకులకు తగిన గుర్తింపు టిడిపిలో కనిపించలేదంటూ పార్టీ మనుగడ కోసం ఎంత కష్టమైనా భరించాము..తన భవిష్యత్తు కార్యక్రమాన్ని రేపటి రోజున పార్టీ నాయకులు కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామంటూ కూడా తెలియజేశారు.. ఇండియన్ హెరాల్డ్ అంచనా మేరకు.. ఈసారి ప్రభాకర్ చౌదరి బరిలో నుంచి తప్పుకుంటారని ఎవరికీ సపోర్ట్ చేయరనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: