తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రధాన పార్టీలన్నీ కూడా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రత్యర్థులను విమర్శించేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ముఖ్యంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో లోకల్ నాన్లోకల్ అనే నినాదం పలు పార్లమెంట్ సెగ్మెంట్లలో వినిపిస్తుంది అని చెప్పాలి.


మెదక్ : కెసిఆర్ సొంత జిల్లాగా, బిఆర్ఎస్ పార్టీ కంచుకోటగా కొనసాగుతున్న మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఇలా లోకల్ నాన్లోకల్ నిదానం కొనసాగుతుంది  బిజెపి నుంచి ఇక్కడ రఘునందన్ రావు, కాంగ్రెస్ నుంచి బీసీ అభ్యర్థి నీలం మధు పోటీ చేస్తున్నారు. ఇక బిఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తూ ఉండడం గమానర్హం. అయితే వెంకటరామిరెడ్డికి అటు మెదక్ జిల్లాకు ఎక్కడ సంబంధం లేదని.. ఒక స్థానికేతరుడైన  వ్యక్తికి ఎలా టికెట్ ఇస్తారు అంటూ రఘునందన్ రావు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా స్థానికేతరుడైన నాయకుడికి అటు ప్రజలు కూడా ఓట్లు వేయరు అంటూ రఘునందన్ చెబుతూ ఉండటం గమనార్హం.


 మల్కాజ్గిరి  : మినీ ఇండియా గా పిలుచుకునే  మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా ఇలా లోకల్ నాన్ లోకల్ పంచాయితీ నెలకొంది. ఏకంగా హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇక్కడ బిజెపి నుంచి పోటీ చేస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి పోటీ చేస్తూ ఉండడం గమనార్హం. అయితే ఈ ఇద్దరు కూడా స్థానికేతరులైన నాయకులు ఇక బిఆర్ఎస్ నుంచి స్థానిక నేత అయినా రాగిడి లక్ష్మారెడ్డి బరిలోకి దిగారు. అయితే ఈ ముగ్గురు కూడా అంగ అర్థబలం కలిగిన నేతలు. దీంతో ముగ్గురి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. అయితే బిఆర్ఎస్ లోకల్ నాన్లోకల్ అనే నినాదాన్ని పట్టుకొని ప్రజల్లోకి వెళ్తుంది. మీకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నాకు ఓటు వేసి గెలిపించండి.. అభివృద్ధి ఏంటో చూపిస్తాను.. కానీ ఎక్కడో ఉండే నాన్ లోకల్ అభ్యర్థులకు ఓటు వేసి తప్పు చేయొద్దు అంటూ లక్ష్మారెడ్డి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఇలా నాన్ లోకల్ అభ్యర్థులకు అసలు ఓట్లే రావు. లోకల్ నేతలమైన మాదే గెలుపు అంటూ అటు మెదక్ ఇటు మల్కాజ్గిరి నియోజకవర్గం కూడా స్థానికులైన నేతలు అనుకుంటూ ఉండటం గమనార్హం. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: