వంగలపూడి అనిత .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం పార్టీ లో మహిళా ఫైర్ బ్రాండ్ గా ఆమెకు పేరుంది. ఆమె 1979 జనవరి 1న విశాఖపట్నం జిల్లా ఎస్ రాయవరం మండలంలోని లింగరాజుపాలెం గ్రామంలో వంగలపూడి అప్పారావు గారి దంపతులకు జన్మించారు.అనిత తండ్రి అయిన అప్పారావు గారు గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్. అనిత కూడా ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పని చేసారు.. చిన్న వయస్సులోనే ప్రభుత్వం టీచర్ గా ఉద్యోగం రావడంతో ఉద్యోగం చేస్తూనే 2009లో ఆంధ్ర యూనివర్సిటీ కరస్పాండెంట్ కోర్సులో ఆమె ఎంఎస్సీ పూర్తి చేశారు. అలాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఆమె ఎం.ఈ.డి పూర్తి చేశారు.ఆమె దాదాపు 12 సంవత్సరాల పాటు ఉపాధ్యాయురాలుగా పనిచేశారు.. రాజకీయాలపై వున్న ఆసక్తితో ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా రాజీనామా చేసి రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారు.. 2012లో గ్రామస్థాయి రాజకీయాల్లో అడుగుపెట్టిన అనిత. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక నేతగా మారారు. తన వాగ్దాటితో అందరిని ఆకట్టుకుంటున్నారు. అలా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఆమెను ప్రోత్సహించారు. 

అలా 2014 ఎన్నికల్లో విశాఖ జిల్లా పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం కల్పించగా ఆ ఎన్నికల్లో సమీప వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చెంగల వెంకటరావుపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టింది.గత 2019 ఎన్నికల్లో అప్పటి రాజకీయ పరిస్థితుల్లో కారణంగా చంద్రబాబు గారు పాయకరావుపేట నుంచి కాకుండా కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనితను పార్టీ అధినేత ఆదేశించారు. అధినేత ఆదేశాన్ని పాటించిన ఆమె. కొవ్వూర్ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ ఎన్నికల్లో వైసిపి ఏకంగా 151 స్థానాల్లో విజయం సాధించగా తెలుగుదేశం కేవలం 23 స్థానాలనే గెలుచుకుంది. 

2021 జనవరి 30న ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలుగా అనిత నియమితులయ్యారు.. తెలుగుదేశం పార్టీ బలమైన మహిళా నేతగా గొంతుని ఎలుగెత్తి చాటుతూ ఎలాంటి పరిస్థితుల్లో అయిన గుండె దైర్యం తో దూసుకెళ్ళింది.2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వంగలపూడి అనిత అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. అంతే కాదు తాజా కాబినెట్ లో ఆమె మంత్రి పదవిని కూడా దక్కించుకున్నారు.నేడు నాలుగో సారి ముఖ్య మంత్రి చంద్రబాబు బాధ్యతలు స్వీకరిస్తున్నారు.. ఇదే వేడుకలో ఆమె హోమ్ మిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: