తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు పర్యాయాలు టిఆర్ఎస్ పాలన నడిచింది. ఈ తరుణంలో కేవలం కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత, కనుసన్నాల్లోనే పాలన మొత్తం కొనసాగిందని చెప్పవచ్చు. మిగతా మంత్రివర్గం, ఎమ్మెల్యేలు అంతా కేవలం  ఆ ముగ్గురు చెప్పింది చేసుకుంటూ పోవడమే. ఇందులో కేసీఆర్ తర్వాత హరీష్ రావే కీలకంగా మారారు. సిద్దిపేట నియోజకవర్గం  దేశంలోనే అద్భుత నియోజకవర్గంగా తీర్చిదిద్దారు. అలాంటి హరీష్ రావు  బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన పిల్లర్ అని చెప్పవచ్చు. అలాంటి బిఆర్ఎస్ పార్టీ 2023 ఎన్నికల్లో విపరీతంగా ఓటమిపాలైంది. దీంతో ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు మింగుడు పడడం లేదు.

 9 సంవత్సరాలు ఏకధాటిగా  పాలించిన వీరికి ఒకసారి ఈ అధికారం పోవడంతో ఏం మాట్లాడాలో కూడా  పాలు పోవడం లేదట. దీంతో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తానని రేవంత్ రెడ్డి ఆ మధ్య కాలంలో ప్రకటించారు.  దీన్ని ఆసరాగా తీసుకున్నటువంటి హరీష్ రావు ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రుణమాఫీ చేస్తే మాత్రం నేను రాజీనామా చేస్తానని హరీష్ రావు ఆనాడు ప్రకటించారు.  ప్రస్తుతం రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి, కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం తెలియజేసింది. ఆగస్టు 15వ తేదీలోగా పూర్తిస్థాయిగా  రుణమాఫీ చేయాలని ప్రకటన కూడా జారీ చేసింది.

ఈ ప్రకటన ఎప్పుడైతే జారీ అయిందో అప్పటినుంచి హరీష్ రావుపై ఒత్తిడి మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులంతా హరీష్ రావు ఏమైంది  రాజీనామా పత్రం రెడీ చేసుకో అంటూ విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. దీంతో నేటిజన్లు కూడా కాంగ్రెస్ శ్రేణులకు సపోర్టుగా నిలుస్తూ హరీష్ రావు రాజీనామా చేయకుంటే పరువు పోతుందని కామెంట్లు పెడుతున్నారు. మరి చూడాలి రుణమాఫీ అయిన వెంటనే హరీష్ రావు రాజీనామా చేస్తారా లేదంటే అందరూ నాయకుల లాగే ఆయన కూడా సైలెంట్ అయిపోతారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: