వైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల అనంతరం వైసిపి పార్టీకి రిజైన్ చేసి జనసేన పార్టీలోకి చేరారు.. అయితే అలా చేరిన తరువాత అటు ఒంగోలులో టిడిపి, జనసేన మధ్య విభేదాలు మొదలయ్యాయనే విధంగా వార్తలు వినిపించాయి. అయితే వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఒంగోలులో కార్పొరేషన్ స్థానాన్ని జనసేన పార్టీకి తీసుకువచ్చేలా చేశారు. ఆ తర్వాత కూడా జనసేన పార్టీలోకి కొంతమంది నేతలను తీసుకురావాలని బాలినేని పలు రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట.


కానీ జనసేన పార్టీలోకి వచ్చేందుకు ఎవరూ కూడా పెద్దగా ఇష్టపడలేదని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకోసం బాలినేని  శ్రీనివాస్ ఎంత ప్రయత్నించినా కూడా కొంతమంది నేతలు తిరస్కరిస్తున్నట్లు ఒంగోలులో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి కొంతమంది వైసీపీ నేతలు మాత్రం వైసిపి పార్టీని విడిచి వచ్చేదే లేదంటూ చెబుతున్నారట. బాలినేని శ్రీనివాసరెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ప్రకాశం జిల్లా తన చేతులలోనే ఉండేది. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు బంధువు కావడం చేత ఈయన చెప్పింది అక్కడ శాసనంగా ఉండేది.

2019 ఎన్నికల వరకు బాలినేని శ్రీనివాస్ అందరి నేతలతో బాగా చనువుగా ఉండే వారు. వారు కూడా ఈయనతో స్నేహం కోసం ఎక్కువగా పాకులాడేవారట. అలాంటిది 2024 ఎన్నికలలో ఓటమి తర్వాత బాలినేని వైసిపి పార్టీని వీడి జనసేనలోకి చేరడం కొంతమంది నేతలకు నచ్చడం లేదట. కానీ ఆయన పార్టీ వీడితే చాలామంది నేతలు తనతో వస్తారని భావించిన బాలినేని కానీ జనసేన పార్టీలో చేరిన భాలినేనికి అంతగా ప్రాధాన్యత లేదని అందుకే ఆయన చేరి ఇప్పటికి ఎన్నో నెలలు కావస్తున్నా ఒక్క పేరున్న నేత కూడా ప్రకాశం జిల్లా నుంచి అసలు జనసేన పార్టీలోకి చేరకపోవడంతో ఇప్పుడు చర్చనీయాంకంగా మారింది.


వీటికి తోడు కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిణామాలు, హామీలు ఎగ్గొట్టడం, ప్రజలను కూటానికి వ్యతిరేకత రావడంతో తిరిగి జగన్ పేరు పుంజుకోవడంతో చాలామంది వెనుకడుగు వేస్తున్నారట. 2029 ఎన్నికలకి ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: