పాకిస్తాన్ ఉగ్రవాది మసూద్ అజార్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్.. అయితే ఇతని చావు కోసం ఇండియన్ ఆర్మీ ఎంతగానో ఎదురు చూసింది.కానీ తృటిలో తప్పించుకున్నాడు. తాజాగా ఆపరేషన్ సింధూర్ పేరిట జరిపిన మెరుపు దాడిలో పాకిస్తాన్ కు చెందిన 9 ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడి చేసింది. అయితే ఇందులో బవహల్పూర్ లోని జైష్-ఏ- మహమ్మద్ ప్రధాన స్థావరంపై మెరుపు దాడి జరిగింది. అయితే ఈ దాడిలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అయినటువంటి మసూద్ అజార్ ఫ్యామిలీ సభ్యులు దాదాపు పది మంది చనిపోయారు. ఇందులో ఆయన అక్క,బావ,భార్య,మేనల్లుడు,పిల్లలు ఇలా అందరూ చనిపోయారని తెలుస్తోంది. అయితే ఇందులోనే మసూద్ అజార్ కూడా ఉన్నారని,ఆయన చనిపోయారని వార్తలు వినిపించినప్పటికీ ఆ తర్వాత కొద్దిసేపటికి మసూద్ అజార్ లేఖ విడుదల చేశారు.. 

ఇక ఈ లేఖలో మసూద్ అజార్ ఏం రాసుకోచ్చారంటే.. కాశ్మీర్ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్ని నియమాలను ఉల్లంఘించాడు. ఈ మెరుపు దాడిలో నేను కూడా చచ్చిపోతే బాగుండు. నా ఫ్యామిలీ మొత్తం చనిపోయింది. ఈ చనిపోయిన వారిలో నా ఐదుగురు పిల్లలు ఉన్నారు.అయితే ఇప్పుడు చనిపోయిన వారందరూ ఆ అల్లా దగ్గరికి వెళ్తారని నేను నమ్ముతున్నాను.కానీ ఈ పని చేసినందుకు ఖచ్చితంగా భారత్ నెత్తురు రుచి చూడక తప్పదు.

కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాను. ఇప్పటినుండి భారతదేశంపై ఎలాంటి జాలి చూపబోము. జాలీ, దయ, దుఃఖం, భయం, నిరాశ ఏదీ లేదు. యుద్ధానికి సిద్ధమే..నరేంద్ర మోడీ వల్ల మేం చాలా నష్టపోయాం. మా పిల్లల అమరత్వం ఊరికే పోదు. శత్రువుల పతనానికి నాంది అవుతుంది. ఎప్పటికీ న్యాయమే గెలుస్తుంది అంటూ చనిపోయాడు అనుకున్న మసూద్ అజార్ ఓ సంచలన లేఖ విడుదల చేయడంతో ప్రస్తుతం ఈయన విడుదల చేసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: