యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ ప్రతిసారి ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూ ఉంటారు. ఆ మధ్య కాలంలో బిగ్ బాస్ లో ఉన్న వాళ్లందరూ బయటికి వచ్చాక బెట్టింగ్ యాప్ లు ప్రమోట్ చేస్తూ అమాయకపు ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారు. ఉగ్రవాదుల బెట్టింగ్ యాప్ లు ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి వారంతా ఉగ్రవాదులే అంటూ ఎంతో మంది బిగ్ బాస్ కంటెస్టెంట్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈయన అందరి బాగోతం బయట పెడితే ఈయన బాగోతం కూడా బయటపడింది. 300 కోట్ల స్కాం లో ఇరుక్కున్నారు. ఇదంతా పక్కన పెడుతూ ప్రపంచంలోని అన్ని దేశాలు తిరుగుతూ అక్కడ ఉండే ఆచారాలు ఫుడ్ ఇలా ప్రతి ఒక్కటి యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ చెప్పే నా అన్వేషణ అన్వేష్ తాజాగా ఇండియన్ ఆర్మీ ని అవమానిస్తూ ట్రోల్స్ కి గురయ్యారు. మరి ఇంతకీ అన్వేష్ ఎందుకు ఇండియన్ ఆర్మీ ని అవమానించారు అనేది ఇప్పుడు చూద్దాం.

 పహల్  గామ్ లో జరిగిన అటాక్ తర్వాత భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్లో ఉన్న ఉగ్రముఖ స్థావరాలపై మెరుపు దాడులు చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సమయంలో యుద్ధం అవసరమా బుద్ధుండాలి అన్నట్లుగా తన యూట్యూబ్ ఛానల్ వీడియోలో షాకింగ్ వ్యాఖ్యలు చేశారు అన్వేష్. భారతదేశంలో పహల్ గామ్ అటాక్ తర్వాత ఎన్నో మీడియా ఛానల్స్,యూట్యూబర్లు యుద్ధం జరుగుతుంది అనే విధంగా పోస్టులు చేస్తున్నారు. అయితే ఈ పోస్టులపై నా అన్వేషణ అన్వేష్ స్పందిస్తూ..  ఇదంతా డబ్బులు సంపాదించుకోవడానికి వాడుకునే టెక్నిక్.అసలు ఈ టైం లో బుద్దున్నోడు ఎవడైనా యుద్ధం చేస్తాడా.. భారత్ ఇప్పుడిప్పుడే ఆర్థికంగా ఎదుగుతుంది. పాకిస్తాన్ ఎప్పుడు భారత్ ని అణిచివేయాలనే చూస్తుంది. పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇండియాలోకి వచ్చి మన మీద అటాక్ చేశారంటే అది మన తప్పే.

పాకిస్తాన్ మనస్తత్వం ఎలా ఉంటుందంటే తాము బాగుపడకపోయినా సరే కానీ శత్రుదేశం అయినా భారత ఎదగద్దు అని కోరుకుంటారు. పాకిస్తాన్ చాలా సంవత్సరాల నుండి భారత్ నాశనాన్ని కోరుకుంటుంది.ఇలాంటి సమయంలో మనమే అప్రమత్తంగా ఉండాలి. అసలు పాకిస్తాన్ యుద్ధం చేయాలంటే ఆఫ్గనిస్తాన్ తో చేయాలి. ఎందుకంటే వారికి అసలైన శత్రువు ఆఫ్గనిస్తానే.. అంటూ యూట్యూబర్ అన్వేష్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్లు ఇండియన్ ఆర్మీనే అవమానిస్తావా.. యుద్ధం జరుగుతుందని వాళ్ళు ఏమైనా కలలు కంటారా.. జాగ్రత్తగా ఉండాలి బుద్ధుండాలి అని మాట్లాడుతున్నావ్.. అసలు నీకు ముందుగా బుద్ధుందా.. దేశమంతా ఆర్మీ ని మెచ్చుకుంటుంటే నువ్వేమో నీ స్వలాభం కోసం వ్యూస్ కోసం ఇండియన్ ఆర్మీ ని తిడతావా అంటూ అన్వేష్ పై దుమ్మెత్తి పోస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: