
అయితే పైప్ లైన్ దెబ్బ తినడం వల్ల ఈ లీకేజ్ జరిగిందని అక్కడ అధికారులు గుర్తించారు. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఫైర్ డిపార్ట్మెంట్ రెస్క్యూటిమ్ మంటలను సైతం ఆర్పి వేసేందుకు పెద్ద ఎత్తున శ్రమించినట్లు తెలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం జరిగిందని తెలిసి వెంటనే సిబ్బంది బయటకు పరుగులు తీశారు.. అయితే అక్కడ సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలియజేస్తున్నారు.
ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించబోతున్నారని అలాగే విశాఖ స్టీల్ ప్లాంటును కూడా అమ్మేయబోతున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మరి ఇలాంటి సంఘటన జరగడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇటీవలే చాలామంది నేతలు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణం కాకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వైయస్ షర్మిల కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు మద్దతుగా నిరాహార దీక్ష కూడా చేసింది. అలాగే ఉద్యోగులు కూడా తమని తొలగించకూడదని కార్మికులందరూ కూడా సమ్మె బాట పట్టారు. మరి విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఈ ప్రమాదం గురించి అటు ఏపీ ప్రభుత్వంతో పాటు ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం, కూటమినేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.