
ఈమధ్య కొడాలి ముంబైలో హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. సర్జరీ నుంచి కోలుకున్న కొడాలి హైదరాబాద్ లో ఉంటున్నారు. అయితే కేసులు, అరెస్టుల భయం ఆయన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆయన క్లోజ్ ఫ్రెండ్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పలు కేసుల్లో అరెస్టై.. 100 రోజులుగా జైలు జీవితాన్ని గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే మెరుగైన వైద్యం పేరుతో అమెరికా వెళ్లిపోయే యోచనలో నాని ఉన్నారని ప్రచారం జరిగింది. దీంతో కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ కొడాలి నాని పై లుకౌట్ నోటీసులు జారీ చేసింది.
అయినా కూడా ఆయన బయటకు రాకపోయేసరికి కొడాలి నాని ఇప్పటికే దేశం విడిచి వెళ్ళిపోయారంటూ కథనాలు వెలబడ్డాయి. అయితే తాజాగా కొడాలి సూపర్ ట్విస్ట్ ఇచ్చారు. హార్ట్ సర్జరీ తర్వాత తొలిసారి ఆయన బయటకు వచ్చారు. అది కూడా లుకౌట్ నోటీసులు జారీ చేసిన మరుసటిరోజే. గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ లో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి మాజీ మంత్రి కొడాలి నాని గత రాత్రి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించి ఫోటోలు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మొత్తానికి కొడాలి నాని బయటకు రావడంతో ఆయన ఇండియాలోనే ఉన్నారన్న విషయం స్పష్టమైంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు