ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వై సీ పీ పార్టీ అధినేత అయినటువంటి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో వరుస పెట్టి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అనేక ప్రాంతాలను పర్యటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఆ పర్యటనలో భాగంగా కూటమి ప్రభుత్వం ఎలాంటి పనులను చేస్తుంది. వాటి ద్వారా ప్రజలకు ఎలాంటి లాభాలు .. నష్టాలు జరుగుతున్నాయి. అని వాటిని తెలుసుకొని , అలాగే ప్రభుత్వం ద్వారా ఏమైనా నష్టాలు జరిగినట్లయితే వాటి గురించి గట్టిగా మాట్లాడుతూ వస్తున్నాడు. ఇకపోతే తాజాగా వై యస్ జగన్మోహన్ రెడ్డి , ప్రకాశం జిల్లా పర్యటనను ప్లాన్ చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ పర్యటనను జగన్ తాజాగా క్యాన్సల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

అసలు అంత ఓకే అయ్యాక జగన్ తన ప్రకాశం జిల్లా పర్యటనను రద్దు చేయడానికి ప్రధాన కారణం భారీ వర్షాలు అని తెలుస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక జిల్లాలలో భారీ వర్షాలు పడనున్నట్లు రిపోర్ట్స్ వచ్చాయి. దానితో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న సమయంలో కూడా ప్రకాశం జిల్లా పర్యటన చేసినట్లయితే దాని ద్వారా ప్రజలకు ఇబ్బంది కలిగి అవకాశం ఉంటుంది అని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.

వాతావరణం అంతా ఓకే అయ్యాక జగన్మోహన్ రెడ్డి , ప్రకాశం జిల్లా పర్యటనను చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే జగన్ రేపు ప్రకాశం జిల్లాలోని పొదిలిలో పర్యటించాల్సిన షెడ్యూల్ ఉంది. అక్కడ పొగాకు రైతులకు కలిసి వారి సమస్యలను తెలుసుకోవాలి అని జగన్ భావించారు. కానీ ఇది తాత్కాలికంగా క్యాన్సల్ అయింది. వాతావరణం చక్క బడ్డాక ప్రకాశం జిల్లా పర్యటనను జగన్ ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: