చింతమనేని ప్రభాకర్ ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే .. ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నేత. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చింతమనేని చుట్టూ ఎన్ని వివాదాలు ఉన్న చేతికి ఎముకలేని నాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. పేద‌ల‌కు పెట్టే విష‌యంలోనూ.. అన్న‌దానాల్లోనూ చింత‌మ‌నేని చేయి ఎప్పుడూ పైనే ఉంటుంది. పండుగ ఏదైనా ఆయన పేరు మార్మోగాల్సిందే అన్నట్టుగా గత ఆరు మాసాలుగా క్రిస్టియన్ పండుగ వచ్చినా.. ముస్లింల రంజాన్ వచ్చినా .. తెలుగువారి శ్రీరామనవమి వచ్చిన ఆయన ముందుంటారు. తనదైన శైలిలో ప్రజలకు పంపకాలు చేస్తారు రంజాన్ సందర్భంగా మైనార్టీ సోదరుల కుటుంబాలకు కిలో చొప్పున మటన్ పంచారు. నవమి వేడుకలు సందర్భంగా ఇంటికి కిలో బెల్లం పంపిణీ చేశారు. ఇప్పుడు టిడిపి పసుపు పండగ మహానాడు ను పరిష్కరించుకుని చింతమనేని తనదైన శైలిలో రుచులు చూపించారు. ప్రత్యేకంగా తన నియోజకవర్గం దెందులూరు నుంచి మంచి వంట నిపుణులను కడపకు తీసుకువెళ్లి మరీ ప్రత్యేక వంటకాలు చేస్తున్నారు.


మూడు రోజులపాటు ఆయన మహానాడుకు వచ్చే అతిధులకు కార్యకర్తలకు ప్రత్యేక రుచులతో కూడిన వంటకాలను శ్రద్ధగా తయారు చేయిస్తున్నారు. వీటిలో నాన్ వెజ్ వంటలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మహానాడులో గతంలో ఇప్పుడు లేని విధంగా ఈసారి నాన్ వెజ్ వంటకాలు పెడుతున్నారు. దీనికి చింతమనేని సారథ్యం వహిస్తున్నారు. చికెన్ మటన్ తో కూడిన ప్రత్యేక వంటకాలు చేస్తున్నారు. దోసకాయ మటన్ కూరను ప్రత్యేకంగా వడ్డిస్తున్నారు. అలాగే బిర్యానీ కమల్ ( కొత్త తరహా వంటకం ) , ఆంధ్ర చికెన్ వండిస్తున్నారు. దీనికి అయ్యే ఖర్చు తానే భ‌రిస్తుస్తున్నట్టు స్వయంగా చెప్పుకొచ్చారు. మరో స్పెషల్ ఆవకాయ వేసవికాలం అనగానే ఆంధ్రులకు ఆవకాయ స్పెషల్ .. దీనిని మహానాడు లో చింతమనేని వడ్డిస్తున్నారు.


తన నియోజకవర్గం నుంచి దాదాపు పదివేల మామిడికాయలను ప్రత్యేక వాహనాలలో మహానాడుకు తీసుకొచ్చి అక్కడే వాటిని ముక్కలుగా కొట్టించి కారం , ఉప్పు , ఆవపిండి నూనెలో కలిపి అప్పటికప్పుడు ఘాటుగాటుగా ఆవకాయ‌ వడ్డిస్తున్నారు. ఇది మూడు రోజులపాటు సరిపోయేలా తయారు చేస్తున్నారు. గత ప్రభుత్వ అరాచకాలకు ఆవకాయతో సమాధానం అంటూ చింతమనేని తనదైన స్టైల్ లో సెటైర్ వేయటం విశేషం.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: