
https://myaadhaar.uidai.gov.in/portal వెబ్ సైట్ లోకి వెళ్లి లాగిన్ ఆప్షన్ క్లిక్ చేసి ఆధార్ నంబర్ తో పాటు క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మొబైల్ నంబర్ కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. డ్యాష్ బోర్డ్ లో ఆధార్ సర్వీస్ ఆప్షన్ ను ఎంచుకోవడం ద్వారా అడ్రస్ ఛేంజ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అక్కడ వివరాలను సరి చేసుకుని నెక్స్ట్ బటన్ క్లిక్ చేసి డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయాలి.
డాక్యుమెంట్లు, నమోదు చేసిన వివరాలు తీసుకుని సబ్మిట్ చేస్తే యూ.ఆర్.ఎన్ నంబర్ వస్తుంది. ఆ తర్వాత వెబ్ సైట్ లో ఈ నంబర్ ద్వారా అప్ డేట్ స్టేటస్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మీ వివరాలు అప్ డేట్ అయిన విధంగా మొబైల్ కు మెసేజ్ వస్తే వెబ్ సైట్ లోకి వెళ్లి ఆధార్ కార్డ్ వివరాలు అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
అవసరం అనుకుంటే 50 రూపాయలు చెల్లించి పీవీసీ కార్డును డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆధార్ కార్డ్ ను డౌన్ లోడ్ చేసుకునే వాళ్లు ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాల్సి ఉంది. ఆధార్ కార్డ్ కు సంబంధించి సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా సులువుగా నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆధార్ కార్డ్ కలిగి ఉన్నవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.