
స్వచ్ఛందంగా పంట మార్పిడి దిశగా రైతులు...
రైతాంగం స్వచ్ఛందంగా పంట మార్పిడి దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేందుకు సిద్ధమయ్యారని ఎమ్మెల్యే ఏలూరి ప్రిన్సిపల్ సెక్రెటరీ వివరించారు. సాగు విస్తీర్ణం పెరగడం,పంట దిగుబడి రావడం ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఎమ్మెల్యే ఏలూరి వివరించారు. ఇప్పటికే రైతులతో పలుమార్లు చర్చించామని పంట మార్పిడికి రైతాంగం సుముఖంగా ఉన్నారని ఈ ఏడాది రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని ఎమ్మెల్యే ఏలూరి కోరారు. రైతులు అధిక పెట్టుబడులు తెచ్చి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు.
కంపెనీలు కొనుగోలు లేక.....
ప్రభుత్వం ప్రతినిత్యం పొగాకు కొనుగోలు పై మానిటరింగ్ చేస్తున్న అనుకున్న స్థాయిలో కంపెనీలు పొగాకు కొనుగోలుకు ముందుకు రావడంలేదని ఎమ్మెల్యే ఏలూరి పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వం పొగాకు కొనుగోలు సంబంధించి మోనిటరింగ్ సెల్ ఏర్పాటు చేసిందని,కంపెనీలు కొనుగోలులో ఎలాంటి పురోగతి లేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి రైతుకు న్యాయం చేసేలా పొగాకు కొనుగోలు చేసేందుకు విస్తృత అధికారాలు వినియోగించనున్నారు. ఉద్యోగ విరమణ చేసిన టుబాకో బోర్డు అధికారులు, ఇతర కంపెనీల ప్రతినిధులు, నిపుణుల సర్వీసును వినియోగించుకోనున్నారు.
విత్తనాలపై కఠిన నిర్ణయం....
మార్కెట్ డిమాండ్ కంటే అత్యధికంగా పంట నిల్వ ఉన్న నేపథ్యంలో రైతుల నష్టపోకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. నల్లబర్లీ విత్తనాలు సరఫరా చేసే ఐటిసి, రాజమండ్రి సి టి ఆర్ ఐ లలో అందుబాటులో లేకుండా చర్యలు తీసుకోనుంది.
కంపెనీలో ఒప్పందం లేకుండా పంటలు సాగు చేయం...
ఒక కంపెనీల ఒప్పందం లేకుండా పంటలు వేయబోమని రైతులు తేల్చి చెప్తున్నారు. భవిష్యత్తులో కంపెనీలో ఒప్పందం చేసుకుంటేనే పంటలు సాగు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఇప్పటికే రైతాంగం కంపెనీల ఒప్పందం లేకుండా పంటలు సాగు చేయమని ప్రకటించారు. అనేక మంది రైతులు ఈ అంశంపై ముందుకు వస్తున్నారు. తద్వారా పంట కొనుగోలు సమయంలో రైతులకు ఇబ్బందులు తప్పనున్నాయి. భవిష్యత్తులో రైతులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ భాగస్వామ్యం చేయనున్నారు. రైతుల భాగస్వామ్యంతో కమిటీలు వేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు