
ఎక్కువ సంఖ్యలో జనం పొగయ్యే ప్రదేశాలలో భద్రతా సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా ఈ తరహా ఘటనలను పునరావృతం చేయకుండా చేయవచ్చు. పోలీసులు సైతం గేట్లు తెరవడానికి ముందే వచ్చిన జనాభాను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. పొలిటికల్ నేతల సభలకు ఎక్కువ సంఖ్యలో జనం హాజరవుతున్నా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోవడం లేదు.
కానీ తక్కువ సంఖ్యలో జనాభా హాజరైన చోటే తొక్కిసలాట ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరు ఎవరిపై నిందలు వేసినా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబాలకు న్యాయం జరగదని చెప్పవచ్చు. ఎక్కువమంది జనాలు పోగయ్యే చోట క్యూలైన్లు ఏర్పాటు చేయడం ద్వారా మంచి ఫలితాలను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరహా ఘటనలపై ఒకింత దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటే దేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తొక్కిసలాట ఘటనలు జరిగిన సమయంలో పరిహారాలు ఇవ్వడం కాదని ఘటనలు జరగకుండా టెక్నాలజీని వాడుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు