
నిజానికి కేసీఆర్ సీఎంగా ఉంటే మంత్రులకు చెప్పినచోట సంతకాలు చేయడం తప్ప మరో స్వేచ్ఛ ఉండేది కాదని అంటారు .. కానీ ఎక్కడ ఏం జరుగుతుందో విషయాలు తెలుస్తాయి .. ఈటలకు ఇంకా బాగా తెలుస్తాయి. ఈ విషయాలు ఆయన కాలేశ్వరం కమిషన్ ముందు చెబుతారా లేదా అనేది ఎప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది . ఒకప్పుడు ఈటల రాజేందర్ , కెసిఆర్ ఎంతో సన్నిహితులు కానీ తర్వాత ఈటల రాజేందర్ ను పార్టీ నుంచి గెంటయ్యడానికి కేసీఆర్ ఎన్నో కుట్రలు చేశాడు .. అలాగే తప్పుడు ప్రచారాలు చేయించి .. ఎస్సీ భూముల్ని కబ్జా చేశారని నిందలు కూడా వేశారు .. ఇలా ఎన్నో ఆరోపణలు చేశారు ..
ఇక చివరకు పార్టీ నుంచి బయటకు తోసేసారు. అతి కష్టం మీద ఈటల రాజేందర్ తన రాజకీయ భవిష్యత్తు కాపాడుకుంటూ వస్తున్నారు .. అయితే ఆ కోపం ఇంకా మనసులోనే ఉంటే మాత్రం కెసిఆర్ గురించి కీలక విషయాలు చెబుతారని . లేకపోతే తాను కూడా ఇరుక్కుంటానని భావిస్తే మాత్రం అంత నిబంధనలకు అనుగుణంగానే జరిగాయని చెప్పే అవకాశం ఉందని అంటున్నారు .. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కేసీఆర్ కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చినట్లుగ ప్రచారం జరగకపోతే మాత్రం తెలంగాణ రాజకీయాల్లో ఈటలకు గట్టి సమస్యలు రావచ్చని అంటున్నారు .. ఇక మరి ఈటల కమిషన్ ముందు కెసిఆర్ పై ఎలాంటి ఆరోపణలు చేస్తారో చూడాలి .